TOP 6 News @ 6 PM: వ్యవసాయం చేయకున్నా ఆ భూములకు రైతు భరోసా -రేవంత్ రెడ్డి
1) జనవరి నెలాఖరుకు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల జాబితా: తప్పుడు సమాచారమిస్తే చర్యలు Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల కోసం చేసిన దరఖాస్తుల్లో ఏమైనా...
1) జనవరి నెలాఖరుకు ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల జాబితా: తప్పుడు సమాచారమిస్తే చర్యలు
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల కోసం చేసిన దరఖాస్తుల్లో ఏమైనా తప్పులు జరిగినా, పొరపాటున తప్పుడు సమాచారం ఎంటర్ చేశారా అనే విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తోంది. క్షేత్రస్థాయిలో సూపర్ చెక్ పేరుతో సర్వే నిర్వహిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజా పాలన కింద దరఖాస్తులు స్వీకరించారు. మరో వైపు ప్రభుత్వం విడుదల చేసిన యాప్ ద్వారా కూడా ఆన్ లైన్ లో అప్లికేషన్లను ప్రభుత్వం స్వీకరించింది. రాష్ట్రంలో 80 ,54,554 లక్షల దరఖాస్తులు అందాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను క్రాస్ చెక్ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి సర్వే వివరాలు జల్లెడపడుతున్నారు. 68, 57, 216 మంది దరఖాస్తులను అధికారులు యాప్ ద్వారా సేకరించారు.
సర్వే పూర్తైన దరఖాస్తులను మరోసారి చెక్ చేయనున్నారు. 4 లక్షల ధరకాస్తులను హౌసింగ్ శాఖ అధికారులు సంబంధిత మండలాలకు, మున్సిపల్ అధికారులకు పంపారు. ఈ ధరకాస్తు దారుల ఇళ్లకు వెళ్లి నేరుగా దరఖాస్తులను క్రాస్ చెక్ చేయనున్నారు. ఇందిరమ్మ యాప్ లో నమోదు చేసిన వివరాలు సక్రమంగా ఉన్నాయా.. తప్పుడు సమాచారం ఇచ్చారా అనే విషయాలను పరిశీలిస్తారు. తప్పుడు సమాచారం నమోదైతే అందుకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటారు.
2) Rythu Bharosa: రైతులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. వ్యవసాయం చేయకున్నా ఆ భూములకు రైతు భరోసా..
Rythu Bharosa: రైతు భరోసాను 2025 జనవరి 26న నుంచి విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేసింది. వ్యవసాయానికి పనికిరాని భూమి, రియల్ ఏస్టేట్ భూములు, లే ఔట్ చేసిన భూములు, నాలా కన్వర్జేషన్ చేసిన భూములు, మైనింగ్ భూములు, గోదాములు, ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూముల వివరాలను సేకరించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. ఈ భూములకు రైతు భరోసా వర్తించదు. ఈ భూముల వివరాలను గ్రామసభల్లో ప్రకటించనున్నారు. తద్వారా రైతుభరోసాకు సంబంధించి గ్రామసభల్లోనే అర్హుల వివరాలపై స్పష్టత రానుంది.
అనర్హులకు రైతు భరోసా కింద డబ్బులు విడుదల చేయవద్దని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి పనికిరాని భూములకు కూడా రైతుబంధు కింద పెట్టుబడి సహాయం చేయడంపై కాంగ్రెస్ అప్పట్లో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. రైతు భరోసాకు సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించి ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టత ఇచ్చారు.పంట వేసినా, వేయకపోయినా వ్యవసాయానికి పనికి వచ్చే ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయానికి పనికిరాని భూములకు గత ప్రభుత్వం రైతు బంధును అమలు చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.
3) పవన్ రూ.10 లక్షలతో పుస్తకాలు కొనుగోలు చేసింది అందుకేనా?
విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న బుక్ ఫెస్టివల్‌లో రూ.10 లక్షల విలువైన పుస్తకాలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనుగోలు చేశారు. అయితే పవన్ ఇక్కడకు వస్తున్నారన్న సమాచారాన్ని మీడియాకు తెలియకుండా అధికారులు గోప్యంగా ఉంచారు. పుస్తక మహోత్సవం నిర్వాహకులతో మాట్లాడిన పవన్.. తన సొంత డబ్బుతో పుస్తకాలకు ఆర్డర్ ఇచ్చారు. ఇంత భారీ మొత్తంలో పుస్తకాలు కొనుగోలు చేసి రికార్డు నెలకొల్పారు. డిప్యూటీ సీఎం పవన్ పుస్తక ప్రియుడన్న సంగతి తెలిసిందే. అయితే ఇంత పెద్ద మొత్తంలో పుస్తకాలు కొనుగోలు చేయడానికి ఓ కారణం ఉంది.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో యువతకు పుస్తక పఠనం అలవాటు చేసేలా అధునాతన సౌకర్యాలతో లైబ్రరీ నిర్మాణం ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఆ గ్రంథాలయంలో ఈ పుస్తకాలు ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 2వ తేదీని విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో బుక్ ఫెయిర్ ప్రారంభించిన పవన్ కళ్యాణ్.. ఈ సందర్భంగా పుస్తక పఠనం ద్వారా కలిగే ప్రయోజాలను, వ్యక్తిగతంగా తనకు కలిగిన మేలును వివరించారు. పుస్తక పఠనం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఎవరికైనా పెద్ద మొత్తంలో సొమ్ములు ఇవ్వడానికి క్షణం ఆలోచించను కానీ.. ఒక పుస్తకం ఇవ్వాలంటే వంద సార్లు ఆలోచిస్తానని చెప్పారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
4) Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ప్రకటనలో జాప్యం..కారణం ఇదే !
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి పాకిస్తాన్ లో ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్ కోసం జట్టును ప్రకటించడానికి ఐసిసి జనవరి 12 ను చివరి తేదీగా నిర్ణయించింది. కానీ బీసీసీఐ దానిని ఆలస్యం చేయవచ్చు. ఐసిసి సూచనలను అనుసరించి టీం ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సకాలంలో జట్టును ప్రకటిస్తారని భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం, BCCI ఇప్పుడు దీని కోసం కొంత సమయం అడగవచ్చు. అయితే, ఇంగ్లాండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును రెండు, మూడు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది.
ఐసిసి సాధారణంగా అన్ని జట్లు తమ టోర్నమెంట్లకు 4 వారాల ముందుగానే తమ తాత్కాలిక జట్లను ప్రకటించమని అడుగుతుంది. అప్పుడు దానిలో మార్పులకు కూడా సమయం ఇస్తుంది. కానీ పాకిస్తాన్, దుబాయ్‌లలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం అది 5 వారాల ముందుగానే 8 జట్ల నుండి జట్లను కోరింది. జనవరి 12న తన జట్టు జాబితాను సమర్పించమని కోరారు. కానీ క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం, బిసిసిఐ దానిని ఒక వారం ఆలస్యం చేయవచ్చు. భారత జట్టును ప్రకటించడానికి తనకు కొంత సమయం ఇవ్వాలని ఆమె ఐసిసిని అభ్యర్థిస్తుంది. జనవరి 18-19 నాటికి ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ తప్ప, మరే ఇతర జట్టు ఇంకా తన జట్టును ప్రకటించలేదు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
5) Gukesh Income: చెస్ ఆటతో అమెరికా ప్రెసిడెంట్ కంటే ఎక్కువే సంపాదించిన గుకేష్
Gukesh earnings in 2024: ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం వింటే మీరు కూడా మీ ఇంట్లో చిన్న పిల్లలకు అర్జెంట్‌గా చెస్ నేర్పించేయాలని అనుకుంటారు. ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచిన గుకేష దొమ్మరాజు వరల్డ్ వైడ్ న్యూస్ హెడ్‌లైన్స్‌లో నిలిచారు. ఎందుకంటే ఇప్పటివరకు ఈ టైటిల్ గెలిచిన పిన్న వయస్కుడు కూడా గుకేష్ కావడం విశేషం. అది ఆయనకు వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌తో పాటు అదనపు క్రేజ్ తీసుకొచ్చింది. అంతేకాదు... 2024 లో చెస్ ఆడటం ద్వారా ఆరు అంకెల ఆదాయం సంపాదించిన వారి జాబితాలోనూ గుకేష్ టాప్ పొజిషన్ సొంతం చేసుకున్నారు.
2024 లో గుకేష్ ఎంత సంపాదించారో తెలుసా? 2024 లో సింగపూర్‌లో జరిగిన వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ పోటీల్లో టైటిల్ గెలుచుకోవడం ద్వారా గుకేష్ 1.35 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నారు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 11.34 కోట్లు అన్నమాట. అది కాకుండా ఆ ఏడాదిలో జరిగిన మొత్తం 8 పోటీల్లో పాల్గొని గెలవడం ద్వారా మొత్తం 15,77,842 డాలర్ల ప్రైజ్ మనీ గెలిచారు. ఆ మొత్తాన్ని ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేస్తే రూ. 13. 6 కోట్లు అవుతుంది. ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ పోటీల్లో నెగ్గి మరో 49,452 డాలర్లు సంపాదించారు. ఇండియన్ కరెన్సీలో ఇది నలభై రెండున్నర లక్షలకు సమానం. గుకేష్ సంపాదన ఇంతటితో అయిపోలేదు. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) Union Budget 2025: మహిళలకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరిలో కీలక ప్రకటన చేయనున్న నిర్మలా సీతారామన్
Union Budget 2025: 2025 కేంద్ర బడ్జెట్‌లో మహిళల కోసం పెద్ద ప్రకటనలు చేయబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం మహిళలపై తన దృష్టిని పెట్టింది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అనేక పెద్ద ప్రకటనలు చేస్తారని మహిళలు ఆశిస్తున్నారు. కేంద్ర బడ్జెట్‌లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకం వ్యవధిని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించవచ్చు. ఈ పథకం ఈ ఏడాది మార్చిలో ముగియనుంది. ఈ పథకం వ్యవధిని ప్రభుత్వం పొడిగించకపోతే కొత్త పథకాన్ని ప్రకటించే అవకాశం ఉంది. మహిళలకు ఆదాయపు పన్నులో ఉపశమనం కలిగించే ప్రకటన కూడా బడ్జెట్‌లో చేయబడవచ్చు.
ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం మహిళలకు ఇచ్చే ఆదాయపు పన్ను రాయితీలను రద్దు చేసింది. ప్రభుత్వం మరోసారి మహిళలపై పన్ను భారాన్ని తగ్గించే ప్రకటన చేయవచ్చని నిపుణులు అంటున్నారు. మహిళలకు ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచవచ్చు. ప్రస్తుతం, కొత్త ఆదాయపు పన్ను విధానంలో పన్ను మినహాయింపు పరిమితి సంవత్సరానికి రూ. 3 లక్షలుగా ఉంది. పాత విధానంలో ఇది రూ. 2.5 లక్షలు. ఇది పురుష, స్త్రీ పన్ను చెల్లింపుదారులు ఇద్దరికీ వర్తిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళలకు ప్రత్యేక పన్ను మినహాయింపు పరిమితిని ప్రకటించే అవకాశం ఉంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire