LIC IPO: ఎల్‌ఐసీ కస్టమర్లకి బ్యాడ్‌న్యూస్‌.. ఐపీఓ వాయిదా పడే అవకాశం..

russia ukraine war effect government may postpone lic ipo
x

LIC IPO: ఎల్‌ఐసీ కస్టమర్లకి బ్యాడ్‌న్యూస్‌.. ఐపీఓ వాయిదా పడే అవకాశం..

Highlights

LIC IPO: ఎల్‌ఐసీ కస్టమర్లకి బ్యాడ్‌న్యూస్‌.. ఐపీఓ వాయిదా పడే అవకాశం..

LIC IPO: గత కొన్ని రోజుల నుంచి ఎల్‌ఐసీ ఐపీఓ తీసుకొస్తున్నట్లు సమాచారం అందించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 13న ప్రభుత్వం SEBIకి ఇష్యూ కోసం DRHP కూడా దాఖలు చేసింది. ఎల్‌ఐసీ ఐపీఓ కోసం పాలసీదారులతో పాటు రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఓలో పాలసీదారులకు 10 శాతం రిజర్వ్ కూడా ప్రకటించారు. మార్చి చివరికల్లా వస్తుందని చెప్పారు. కానీ ఇప్పుడు పిడుగులాంటి వార్త బయటికొచ్చింది. ఎల్‌ఐసీ ఐపీఓ వాయిదాపడే అవకాశాలున్నట్లు మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

రష్యా-ఉక్రెయిన్ వార్ మధ్య మార్కెట్‌లో కొనసాగుతున్న అస్థిరతతో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం LIC IPOని వాయిదా వేయడానికి నిర్ణయం తీసుకొవచ్చని వార్తులు వెలువడుతున్నాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం మార్చి నెలాఖరులోగా ఐపీఓను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేయడం గమనార్హం. కానీ రష్యా-ఉక్రెయిన్ వివాదం కారణంగా ప్రపంచ మార్కెట్‌లో క్షీణత సంకేతాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఐపీఓని వచ్చే ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయవచ్చని అందరు భావిస్తున్నారు.

ప్రభుత్వం ఈ వారంలో ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనుంది. ఇందులో ఎల్‌ఐసి లిస్టింగ్ ఈ సంవత్సరం మార్చిలో జరుగుతుందా లేదా అనేది నిర్ణయిస్తారు. ప్రపంచ పరిస్థితుల దృష్ట్యా, ఐపిఓ ప్రారంభ సమయాన్ని మార్చవచ్చని దీనికి సంబంధించిన అధికారి ఒకరు తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా 'గతంలో నేను మునుపటి ప్రణాళిక ప్రకారమే వెళ్లాలనుకున్నాను. కానీ ఇది భారతీయ మార్కెట్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రపంచ మార్కెట్‌లో క్షీణత సంభవిస్తే IPO సమయాన్ని పునఃపరిశీలించే అవకాశాలు ఉన్నాయని' తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories