జమ్మూ అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు: పరస్పరం దాడులు చేసుకున్న ఎమ్మెల్యేలు

Ruckus in Jammu Kashmir Assembly as Engineer Rashids Brother Displays Article 370 Banner
x

జమ్మూ కశ్మీర్ గందరగోళ పరిస్థితులు: పరస్పరం దాడులు చేసుకున్న ఎమ్మెల్యేలు

Highlights

Jammu Kashmir Assembly: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గురువారం ఎమ్మెల్యేలు పరస్పరం దాడులు చేసుకున్నారు.

Jammu Kashmir Assembly: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో గురువారం ఎమ్మెల్యేలు పరస్పరం దాడులు చేసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ఆర్టికల్ 370 పునరుద్ధరించాలని కోరుతూ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ బ్యానర్ ను ప్రదర్శించారు.అయితే దీనికి బీజేపీ ఎమ్మెల్యే సునీల్ శర్మ అభ్యంతరం తెలిపారు. దీంతో అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకున్నాయి. ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. కొందరు ఎమ్మెల్యేలు స్పీకర్ పై పేపర్లు చింపివేశారు. ఈ గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో అసెంబ్లీని వాయిదా వేశారు స్పీకర్.

నాలుగు రోజులుగా గొడవ

370 ఆర్టికల్ విషయంలో నాలుగు రోజులుగా అసెంబ్లీలో గందరగోళపరిస్థితులు నెలకొన్నాయి. 370 ఆర్టికల్ ను పునరుద్ధరించేందుకు సంప్రదింపులు జరపాలని బుధవారం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానాన్ని బీజేపీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదే విషయమై ఇవాళ కూడా బీజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్ సభ్యుల మధ్య గొడవ జరిగింది. మార్షల్స్ రంగంలోకి దిగి గొడవకు దిగిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బయటకు పంపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories