COVID-19 Positive: ఆర్ఎస్ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్ కు కరోనా

RSS Chief Mohan Bhagwat Tests Positive For Covid-19
x

COVID-19 Positive:(File

Highlights

COVID-19 Positive: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా సోకింది.

COVID-19 Positive: కరోనా సెకండ్ వేవ్ సైలెంట్ గా తన పని కానిచ్చేస్తోంది. దీంతో దేశంలో కరోనావైరస్ మహమ్మారి రోజురోజుకు చెలరేగిపోతోంది. ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, నాయకులు ఈ మహమ్మారి బారిన పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్‌కు కరోనా సోకింది. ఇటీవలనే ఆయన కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. ఈ క్రమంలో భగవత్‌కు తేలికపాటి లక్షణాలు కనిపించగా.. కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో కోవిడ్ -19 పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు ఆర్ఎస్ఎస్ శుక్రవారం పేర్కొంది. వెంటనే ఆయన నాగ్‌పూర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారని ఆర్ఎస్ఎస్ ట్విట్ చేసి వెల్లడించింది.

''మోహన్ భగవత్ కు ఈ రోజు మధ్యాహ్నం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ప్రస్తుతం ఆయనకు కరోనావైరస్ సాధారణ లక్షణాలు ఉన్నాయి. ఈ మేరకు భగవత్ నాగ్‌పూర్‌లోని కింగ్స్‌వే హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్నారు''. అంటూ ఆర్ఎస్ఎస్ ట్విట్ చేసి వెల్లడించింది. ఇదిలాఉంటే.. మార్చి 7 న మోహన్ భగవత్ కరోనా వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నారు. అయినప్పటికీ.. ఆయన కరోనా బారిన పడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories