Andhra Pradesh: ఆ ఉద్యోగులు కరోనాతో చనిపోతే రూ.10 లక్షల పరిహారం

Rs10 lakh Compensation if Employees Working Under the Employment Guarantee Scheme
x

మంత్రి పెద్ది రెడ్డి (ఫైల్ ఇమేజ్)

Highlights

కరోనాతో ఉపాధి హామీ ఉద్యోగులు చనిపోతే రూ.10లక్షల పరిహారం చెల్లిస్తామని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు.

Andhra Pradesh: ఏపీలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఒక వేళ దురదృష్టవశాత్తూ కరోనాతో మరణించినట్లయితే పది లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు. అంతేకాదు, కొవిడ్ బారినపడి ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగికి నెల జీతం అడ్వాన్స్గా చెల్లిస్తామని ఆయన తెలిపారు.

నాలుగు జిల్లాల ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లతో మంత్రి పెద్దిరెడ్డి వెబ్ఎక్స్ సమావేశం నిర్వహించిన సందర్భంలో ఈ ప్రకటన చేశారు. కిందటి సంవత్సరం ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు సాధించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో అంతకుమించి ఫలితాలు సాధించాలని మంత్రి పెద్దిరెడ్డి ఉపాధి హామి సిబ్బందిని కోరారు. కూలీలకు ఎక్కువ పనిదినాలను కల్పిస్తే దాని ద్వారా మెటీరీయల్ వాటా ఎక్కువ సాధించగలుగుతామని మంత్రి వివరించారు. వాటితో గ్రామీణ మౌలిక సదుపాయాలు నిర్మించుకోవచ్చన్నారు.

జలశక్తి అభియాన్ పనులను వర్షాకాలంలోపు పూర్తి చేయాలన్నారు. 'వైఎస్ఆర్ జలకళ' పథకంలో భాగంగా 5 ఎకరాల లోపు ఉన్న ప్రతి పేదరైతుకి ఉచితంగా బోరు వేయించేలా ప్రాజెక్ట్ డైరెక్టర్లు చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి ఈ సందర్భంగా ఆదేశాలిచ్చారు. జూన్ నెలాఖరుకు 16 కోట్ల పని దినాలను పూర్తి చేస్తే, కేంద్రాన్ని అదనంగా ఆడగవచ్చని మంత్రి ఉపాధి హామీ సిబ్బందికి వెల్లడించారు. రోడ్లకిరువైపులా మొక్కల పెంపకం, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటడం, బ్లాక్ ప్లాంటేషన్ వంటి పనులను చేపట్టాలని ఆదేశించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories