Aatmanirbhar Bharat: వలస కార్మికుల పునరావాసం కోసం 11 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ!

Aatmanirbhar Bharat: వలస కార్మికుల పునరావాసం కోసం 11 వేల కోట్ల కేంద్ర ప్యాకేజీ!
x
Highlights

వలస కార్మికుల పునరావాసం కోసం కేంద్ర ప్రభుత్వం 11వేల కోట్లు కేటాయించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. SDRF కింద వలస కూలీలకు బస, ఆహారం,...

వలస కార్మికుల పునరావాసం కోసం కేంద్ర ప్రభుత్వం 11వేల కోట్లు కేటాయించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. SDRF కింద వలస కూలీలకు బస, ఆహారం, తాగునీరు అందించామని ఇందుకుగాను రాష్ట్రాలకు ఏప్రిల్ 3న 11వేల కోట్లను కేంద్రం చెల్లించిందని తెలిపారు. మార్చి 28 నుంచి సిటీల్లో నిరాశ్రయులైన వాళ్లకు మూడు పూటలా పోషకాహార ఆహారం అందించామని చెప్పారు. పట్టణపేదలకు లక్షా 25వేల లీటర్ల శానిటైజర్లు, 3 కోట్ల మాస్క్ లు ఉచితంగా అందించామన్నారు.

కరోనా మహమ్మారి విజృంభణతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిలూదేందుకు కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ రెండో రోజు నిన్న వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీలో భాగంగా వలస కార్మికులు, వీధి వ్యాపారులు, స్వయం ఉపాధి, చిన్న, సన్నకారు రైతులు, ముద్ర యోజన, హౌసింగ్, ఉద్యోగ కల్పన అంశాల కేటాయింపులను వివరించారు.

ఈ ప్యాకేజీలో వలస కూలీల కోసం కేటాయింపులను చేశారు. వలస కార్మికుల కోసం ఒకేదేశం- ఒకే వేతనం విధానం అమలు చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. వలస కార్మికుల పునరావాస నిర్మాణ కేంద్రాల కోసం కేంద్రం 11వేల కోట్ల రూపాయాలను ఖర్చు చేశామన్నారు. వలస కూలీకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరాం అన్నారు. వలస కూలీల రోజు వారి కూలీని 182 నుంచి 202కు పెంచామన్నారు. వలస కూలీల ఉపాధి కోసం 10వేల కోట్లు కేటాయింపు చేశారు. అసంఘటిత కార్మికులందరికి వైద్య పరీక్షలు చేయిస్తాం మన్నారు నిర్మల సీతారామన్.

మరో వైపు ఒకే దేశం- ఒకే రేషన్ కార్డును ప్రవేశ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఆగస్ట్ నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు దేశంలో 83శాతం రేషన్ కార్డులున్నాయి అంతేకాదు ఇక నుంచి దేశంలో ఎక్కడి నుంచి అయిన రేషన్ తీసుకునే సదుపాయం కల్పించనున్నారు. రానున్న రెండు నెలల పాటు వలస కూలీలకు నిత్యావసర సరుకులు అందించనున్నారు.

గృహ రుణాలు తీసుకున్న మధ్యతరగతికి ఈ కరోనా కాలంలో కేంద్రం ఊరట కల్పించింది. గృహ నిర్మాణ రంగాన్ని బలోపేతం చేసేందుకు గృహ, నిర్మాణ రంగాలకు 70వేల కోట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా మే 2017 నుంచి అమలులో ఉన్న మధ్య ఆదాయ వర్గాలకు గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని మరో ఏడాది పాటు పొడగిస్తున్నట్టు కేంద్రం మంత్రి తెలిపారు.

దేశంలో దాదాపు 50లక్షల మంది వీధి వ్యాపారులకు 5వేల కోట్ల రుణ సాయిం చేస్తామన్నారు. ఒక్కొక్కరికి 10వేలు చొప్పున వర్కింగ్ క్యాపిటల్ కింద రుణం మంజూరు చేస్తామని కేంద్రం వెల్లడించింది. చిన్న వ్యాపారులు బ్యాంకులు ద్వారా లావాదేవీలు జరిపితే మరింత రుణానికి అవకాశం ఉందని తెలిపింది. కరోనా నేపథ్యంలో కుదేలు అయిన ఆర్థిక వ్యవస్థను వలసకూలీలకు, చిన్న సన్నకారులకు, వీధి వ్యాపారులకు ఊతం ఇచ్చేలా చర్యలు తీసుకున్నారనే చెప్పాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories