Remdesivir: దేశ వ్యాప్తంగా రెమిడెసివిర్ కొరత

Remdesivir Shortage Hits Hospitals in India
x

Remdesivir: దేశ వ్యాప్తంగా రెమిడెసివిర్ కొరత

Highlights

Remdesivir: కరోనా కాక రేపేస్తోంది. సెకండ్ వేవ్ చుక్కలు చూపించేస్తోంది.

Remdesivir: కరోనా కాక రేపేస్తోంది. సెకండ్ వేవ్ చుక్కలు చూపించేస్తోంది. సునామీలా కమ్మేస్తుంది ఉన్నట్లుండి పెరిగిపోతున్న కేసులతో ఆస్పత్రులు నిండిపోతున్నాయ్ బెడ్స్ ఖాళీ ఉండటం లేదు. మొదటి దశ చేదు అనుభవాలు ఇంకా వెంటాడుతుంటే ఆక్సిజన్ కొరత ఒకవైపు భయపెడుతోంది. ఊపిరితిత్తుల్లోకి చేరుతున్న వైరస్ మనుషుల ఉసురుతీస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రి పాలవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ బాధితులకు ఇచ్చే మందుల విషయంలో తీవ్ర కొరత ఏర్పడుతోంది.

వైరస్ సోకి శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతున్న వారికి ఆక్సిజన్‌తో పాటు రెమిడెసివిర్ ఇంజక్షన్​లను ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యతో పాటే రెమిడెసివిర్ ఇంజక్షన్ల వినియోగం కూడా పెరిగింది. దీంతో ఒక వైపు కరోనా కల్లోలం సృష్టిస్తున్న క్రమంలో కరోనా వైద్యంలో కీలకమైన రెమిడెసివర్ ఇంజెక్షన్ మాత్రం దొరకడం లేదు.

రెమిడిసివిర్ కరోనాకు రెమిడీ కాదా? ఇది ఇంజెక్షన్ లో లేదా టాబ్లెట్ల రూపంలో తీసుకోవడం వల్ల ఉపయోగం ఉండదా? అంటే అవుననే అంటున్నారు డాక్టర్లు. రోగికి కాస్త స్వాంతన చేకూర్చడం మినహా ఈ డ్రగ్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదంటున్నారు. రెమిడిసివర్ కరోనాకు ట్రీట్ మెంట్ కాదంటున్నారు తెలంగాణ హెల్త్ డైరక్టర్.

కరోనా వచ్చిన రోగులకు చేసే వైద్యంలో రెమిడెసివర్ మాత్రమే ఏకైక ఇంజెక్షన్ కావడంతో దానికి విపరీతమైన డిమాండ్ ఉంది. కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ ఇంజెక్షన్ కు డిమాండ్ కూడా తీవ్రంగా ఉంది. అయితే డిమాండ్ కు సరిపడా సరఫరా జరగని పరిస్థితి నెలకొంది. ప్రైవేటులో పూర్తి స్థాయిలో ఇంజక్షన్లు కొరత ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్ మార్కెట్ లో సైతం రెమిడెసివిర్ ను విక్రయిస్తున్నారు. మరికొందరు వ్యాపారులు కాసులకు కక్కుర్తి పడి మార్కెట్​లో కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. ఫలితంగా ఒక్కో ఇంజక్షన్ ధర భారీగా పెరిగింది. దీంతో సాధారణ, మధ్యతరగతి ప్రజలు వేల రూపాయలు పోసి ఇంజక్షన్లు కొనలేక చికిత్స చేయకపోతే ప్రాణాలను కాపాడుకోలేక సతమతమవుతున్నారు. ఇక్కడే కాదు అటు ఉత్తరాదినా ఈ డ్రగ్ కొరత తీవ్రంగా ఉంది.

ఇక గత కొద్దీ రోజులుగా ఏపీలో కేసుల వ్యాప్తి చాలా వేగంగా విస్తరిస్తున్నపరిస్థితి. దీంతో మళ్లీ రెమిడెసివిర్ కు ఫుల్ డిమాండ్ వచ్చేసింది. దీంతో కొరత కూడా మొదలై బ్లాక్ లో అమ్మే స్థాయికి వెళ్లింది. రోజుకు 50 వేల ఇంజెక్షన్ల డిమాండ్ ఉంటే 5 వేల ఇంజెక్షన్లు మాత్రమే సరఫరా అవుతున్న పరిస్థితి. దీంతో విపరీతంగా కొరత వచ్చేసింది. బెజవాడలో రెమిడెసివర్ కృత్రిమ కొరత వేధిస్తోంది. రెమిడెసివర్‌ కోసం మెడికల్‌ షాపుల దగ్గర రోగుల బంధువులు క్యూ కట్టారు. వాస్తవానికి రెమిడెసివర్ ను బహిరంగ మార్కెట్ లో విక్రయించ వద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఇంకా ప్రయోగదశలోనే ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories