Reliance: రిలయన్స్ కీలక నిర్ణ‌యం..కోవిడ్ బాధిత ఉద్యోగి కుటుంబాలకు భారీ సాయం

Reliance Industries to Give 5 Years of Salary to Families of Employees who Died of Covid
x

Reliance: రిలయన్స్ కీలక నిర్ణ‌యం..కోవిడ్ బాధిత ఉద్యోగి కుటుంబాలకు భారీ సాయం

Highlights

Reliance: కరోనా కష్టకాలంలో తమ ఉద్యోగులను ఆదుకునేందుకు రిలయన్స్​ గ్రూప్​ ఆఫ్​ ఇండస్ట్రీస్​ కీలక నిర్ణయం తీసుకుంది.

Reliance: కరోనా కష్టకాలంలో తమ ఉద్యోగులను ఆదుకునేందుకు రిలయన్స్​ గ్రూప్​ ఆఫ్​ ఇండస్ట్రీస్​ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్, ముఖేశ్‌ అంబానీ సతీమణి నీతా అంబానీ కీలక ప్రకటన చేశారు. కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబానికి 5 సంవత్సరాలు పూర్తి వేతనం ఇవ్వడంతో పాటు వారి పిల్లలకు విద్య అందించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ నిర్ణయం తీసుకుంది. ఆఫ్​ రోల్స్​ ఎంప్లాయిల కుటుంబాలకు పదిలక్షల సాయం అందిస్తామని వెల్లడించారు.

కోవిడ్ బారిన పడ్డ ఎంప్లాయిస్​, వాళ్ల కుటుంబాలు పూర్తిగా కోలుకునేంతవరకు జీతాలతో కూడిన సెలవుల్ని​ మంజూరు చేసిన రిలయన్స్. కరోనాతో చనిపోయిన ఉద్యోగి భార్య, పేరెంట్స్, పిల్లల ఆస్పత్రి ఖర్చుల కోసం 100 శాతం ప్రీమియం చెల్లింపును రిలయన్సే భరించాలని నిర్ణయం తీసుకుంది. చనిపోయిన ఉద్యోగి పిల్లలందరికీ గ్రాడ్యుయేషన్​ వరకు దేశంలో ఏ ఇనిస్టిట్యూట్‌లోనైనా 100 శాతం ట్యూషన్ ఫీజు, హాస్టల్ సౌకర్యానికి అవసరమయ్యే ఖర్చులనూ రిలయన్స్ ఫౌండేషన్ అందించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories