Reliance Foundation Day: రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సాధారణ సమావేశాన్ని ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ రోజు దృశ్యమాధ్యమ విధానంలో ప్రారంభించారు.
Reliance Foundation Day: రిలయన్స్ ఇండస్ట్రీస్ 43వ వార్షిక సాధారణ సమావేశాన్ని ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఈ రోజు దృశ్యమాధ్యమ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రిలయన్స్ కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ మాట్లాడుతూ ''మానవ చరిత్రలోనే కరోనా వైరస్ అత్యంత ఇబ్బంది కరమైన పరిస్థితి అని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ నుంచి అనంతరం భారత్‌తో పాటు మిగిలిన ప్రపంచ దేశాలు అతి వేగంగా కోలుకుంటాయని ఆశిస్తున్నానన్నారు. జియో ప్లాట్‌ఫామ్‌లో 7.7శాతం వాటా కోసం గూగుల్ రూ.33,737 కోట్లను పెట్టుబడి పెట్టనుందని తెలిపారు.
150 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించిన తొలి భారతీయ కంపెనీగా రిలయన్స్ చరిత్ర సృష్టించింది. గత ఏజీఎంలో చెప్పినట్లుగానే రిలయన్స్ నికర రుణ రహిత సంస్థగా మారిందని సంతోషంగా చెబుతున్నా. దీంతోపాటు భారత్‌లో అతిపెద్ద రైట్స్ ఇష్యూని కూడా పూర్తి చేశాం. మేము 4జీ లేదా 5జీ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేయగలమని నమ్ముతున్నానని అన్నారు. గూగుల్‌తో కలిసి ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్నామని పేర్కొన్నారు. ఇక కన్జ్యూమర్ వ్యాపారం ఈబీఐటీడీఏ 49శాతం వృద్ధి సాధించిందన్నారు. జియో సొంతంగా 5జీ సొల్యూషన్స్‌ను అభివృద్ధి చేసిందని,ఇది ప్రపంచ స్థాయి సేవలను భారత్‌కు అందిస్తుందని స్పష్టం చేసారు.
వచ్చే ఏడాది దీనికి సంబంధించిన సేవలు అందుబాటులోకి రావచ్చునని, స్పెక్ట్రం రాగానే త్వరలోనే పరీక్షిస్తామన్నారు. మా కన్జ్యూమర్, టెక్నాలజీ వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. భారత్‌లో వేగంగా పెరిగిన డేటా డిమాండ్‌ను తట్టుకొని జియో నిలిచిందని తెలిపారు. సాంకేతికతతో మీడియా, ఫైనాన్షియల్ సర్వీస్, స్మార్ట్ సిటీస్, స్మార్ట్ మ్యానిఫ్యాక్చరింగ్, న్యూ కామర్స్, ఎడ్యూకేషన్, హెల్త్‌కేర్, వ్యవసాయం, స్మార్ట్ మొబిలిటీ రంగాల్లో భారీ మార్పులు వస్తాయని పేర్కొన్నారు.
'జియో గ్లాస్' ఆవిష్కరణ..
ఈ సమావేశంలో ఇషా, ఆకాశ్ అంబానీలు జియోటీవీ ప్లస్‌ను ప్రదర్శించారు. అనంతరం వారు జియోగ్లాస్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆకాశ్ అంబానీ మాట్లాడుతూ'' రిలయన్స్ సిబ్బంది అభివృద్ధి చేసిన 5జీ గురించి ప్రకటించడాన్ని గర్వంగా భావిస్తున్నానన్నారు. ఈ స్మార్ట్ కళ్లద్దాల బరువు కేవలం 75 గ్రాములు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసారు. ఇది మిక్స్‌డు రియాలటీ సేవలను అందిస్తుందన్నారు. దీనిలో 25 రకాల యాప్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. దీనికి కేబుల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చన్నారు. ఒక సారి స్పెక్ట్రం అందుబాటులోకి రాగానే వీటిని వినియోగంలోకి తెస్తామని పేర్కొన్నారు.
అనంతరం జియోమార్ట్ పురోగతి గురించి ఇషా అంబానీ వివరించారు. ''జియోమార్ట్‌కు రెండు మూల స్తంభాలు ఉన్నాయి. వీటిలో ఒకటి శక్తివంతమైన దేశీయ టెక్నాలజీ వేదికను కిరాణా దుకాణదారులకు, ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం..రెండోది.. రిలయన్స్ రిటైల్‌కు ఉన్న నెట్‌వర్క్ సాయంతో ఈ ఫలాలను దేశంలోని మూలమూలలకు చేర్చడం '' అని అన్నారు. 200 పట్టణాల్లో ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ ప్రాజెక్టుకు సానుకూల స్పందన లభించిందని పేర్కొన్నారు.
'మిషన్ అన్నసేవ' 5కోట్ల మందికి భోజనం
అనంతరం ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ మాట్లాడుతూ వివిధ అంశాలను ఈ సమావేశంలో వెల్లడించారు. 'మిషన్ అన్నసేవ' కింద రిలయన్స్ 5 కోట్ల మంది పేదలకు భోజనాలను అందించిందని పేర్కొన్నారు. కరోనా టీకా వచ్చాక అది ప్రతిఒక్కరికి చేరేలా తమ డిజిటల్ నెటవర్క్ ద్వారా సాయం చేస్తామన్నారు. జియో దాదాపు 40 కోట్ల మందిని అంతర్జాలంతో కలుపుతోందన్నారు. జియో కారణంగా 30వేల సంస్థల ఉద్యోగులు వర్క్‌ఫ్రం హోం చేయగలుగుతున్నారన్నారు.
నాకు ముఖ్యంగా నాలుగు అంశాలు సంతృప్తిని ఇచ్చాయి. మాకు లక్షల మంది రైతులు తాజా కూరగాయలు, పండ్లు నేరుగా విక్రయిస్తున్నారని తెలిపారు. వారి రిటైల్ స్టోర్లలో మూడింట రెండొంతులు టైర్2, టైర్3 పట్టణాల్లోనే ఉన్నాయని తెలిపారు. వారి అభివృద్ధి వ్యూహం లక్ష మంది చిరువ్యాపారులతో అనుబంధమే అని వారు తెలిపారు. వారికి వచ్చే వాటిల్లో 80శాతం రైతుల నుంచే కొంటున్నారని స్పష్టం చేసారు. దేశ వ్యాప్తంగా లక్షలామందికి మేము ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు.
''రిలయన్స్ మిగిలిన భారతీయ కంపెనీలు, స్టార్టప్‌లతో కలిసి 'మేడిన్ ఇండియా', 'మేడ్ ఫర్ ఇండియా', 'మేడ్ ఫర్ వరల్డ్ ' విధానాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. భారత మార్కెట్లోకి రావడానికి వారికున్న చమురు, రసాయనాల వ్యాపారం విదేశీ కంపెనీలకు చాలా ముఖ్యం అని తెలిపారు. 2035 నాటికి కర్బాన ఉద్గార రహిత సంస్థగా మారాలనేది వారి లక్ష్యం అని తెలిపారు. కొవిడ్, మార్కెట్లోని ఇతర కారణాల వల్ల అరామ్‌కో డీల్ అనుకున్నంతగా ముందుకు సాగలేదన్నారు. వారు సౌదీ అరామ్‌కోతో దీర్ఘకాలిక బంధాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసారు.
గూగుల్ సీఈవో సందేశం..
ఇక ఈ సమావేశంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వీడియో సందేశం ఇచ్చారు. స్మార్ట్‌ఫోన్, చౌకగా లభించే డేటా ఈ రెండు భారతీయులు తేలిగ్గా ఆన్‌లైన్‌లోకి వచ్చేందుకు సహాయపడుతున్నాయని పేర్కొన్నారు. దీంతో భారతీయులు ఇప్పుడు టెక్నాలజీ వారి దగ్గరికి వచ్చే వరకు ఎదురు చూడాల్సిన అవసరంలేదని తెలిపారు. స్మార్ట్‌ఫోన్ వాడే అవకాశం రాని వందల మందికి ఇంటర్నెట్‌ను చేర్చేందుకు 4.5 బిలియన్ డాలర్లతో చేసిన గూగుల్ ఫర్ ఇండియా డిజిటలైజేషన్ ఫండ్ ద్వారా ఏర్పాటుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ''ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ అందుబాటులోకి రావాలన్నారు. జియోతో జట్టుకట్టిన అంశాన్ని ట్విటర్‌లో వెల్లడించారు. జియోతో జట్టుకట్టినందుకు గర్విస్తున్నానన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire