Locker: బ్యాంకులో ఖాతా లేకున్నా లాకర్..

RBI Issues New Guidelines for Locker in Banks
x

Locker: బ్యాంకులో ఖాతా లేకున్నా లాకర్..

Highlights

Locker: బ్యాంకులో లాకర్ కావాలంటే ఇప్పటి వరకు ఆ బ్యాంకులో ఖాతా ఉండాలి.

Locker: బ్యాంకులో లాకర్ కావాలంటే ఇప్పటి వరకు ఆ బ్యాంకులో ఖాతా ఉండాలి. బ్యాంకులో ఖాతాను ప్రారంభిస్తేనే లాకర్ ప్రారంభించే పరిస్థితి. అయితే ఇక నుండి ఈ ఇబ్బందులు ఉండవు. బ్యాంకులో ఖాతా లేకపోయినప్పటికీ సేఫ్ డిపాజిట్ లాకర్/ సేఫ్ కస్టడీని అందించాలని ఆదేశిస్తూ ఆర్బీఐ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. బ్యాంకుతో ఎలాంటి సంబంధం లేకపోయినా, బ్యాంకు కోరిన వివరాలు ఇచ్చి నిబంధనలు పాటించిన వారికి సేఫ్ డిపాజిట్ లాకర్ లేదా సేఫ్ కస్టడీని అందించాలని ఆదేశించింది. ఈ కొత్త మార్గదర్శకాలు జనవరి 1వ తేదీ నుండి అమలులోకి వస్తాయి.

బ్యాంకులు ఇక నుండి సొంతంగా కొన్ని నిబంధనలు రూపొందించుకొని అమలు చేసుకునే వెసులుబాటును ఆర్బీఐ కల్పించింది. బ్యాంకులు తమ శాఖల్లో ఖాళీగా ఉన్న లాకర్స్ సంఖ్య, వెయిటింగ్‌లో ఉన్న వారి వివరాలు కోర్ బ్యాంకింగ్ సిస్టంలో నమోదు చేయాలని పేర్కొంది. లాకర్ల జారీలో పూర్తి పారదర్శకత ఉండేలా చూస్తోంది ఆర్బీఐ. లాకర్‌కు సంబంధించి ఆరు నెలల్లో కొత్త మార్గదర్శకాలు విడుదల చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో సుప్రీం కోర్టు ఆర్బీఐకి సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories