Rahul Gandhi slams On govt: దేశ ఆర్ధిక పరిస్థితిపై రాహుల్ ఆగ్ర‌హం

Rahul Gandhi slams On govt:  దేశ ఆర్ధిక పరిస్థితిపై రాహుల్ ఆగ్ర‌హం
x

Rahul Gandhi

Highlights

Rahul Gandhi slams On govt: కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన విషయం తెలిసిందే. అయితే.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది

Rahul Gandhi slams On govt: కరోనా మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన విషయం తెలిసిందే. అయితే.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో తాజా దేశ ఆర్ధిక వ్యవస్థ పరిస్థితి పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 'దేశ ఆర్ధిక పరిస్థితి గురించి నేను నెలల తరబడి హెచ్చరిస్తున్న విషయాన్నే ఇప్పుడు ఆర్‌బీఐ వార్షిక నివేదికలో కూడా పేర్కొంది. పారిశ్రామికవేత్తలకు పన్ను తగ్గింపు కాకుండా పేదలకు డబ్బు పంచండి. వినియోగాన్ని ప్రోత్స‌హించి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పున‌రుద్ద‌రించండి. మీ ప్రచారాల‌కు మీడియాను వాడుకున్నంత మాత్రాన భార‌త్ ఆర్థిక సంక్షోభంలో ఉంద‌న్న విష‌యం క‌నిపించ‌క‌మానదు' అంటూ కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్‌గాంధీ కేంద్రంపై విమ‌ర్శ‌లు మ‌రోసారి గుప్పించారు.

కరోనా ప్రభావం భారతదేశ సంభావ్యతపై నిర్మాణాత్మక క్షీణతకు కారణమవుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. దీంతో ఆర్థిక వ్యవస్థ మందగమనం రెండో త్రైమాసికంలోనూ కొనసాగనుందని తెలిపింది. వినిమయ రంగానికి తీవ్ర విఘాతం నెలకొందని, డిమాండ్‌ పుంజుకునే కార్యకలాపాలు ఆశించిన మేర పుంజుకోలేదని పేర్కొంది. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు క్షీణించడంతో వృద్ధికి ఉపకరించే మూలధన వ్యయం వెచ్చించే పరిస్థితి లేదని తెలిపింది. పన్ను ఎగవేతదారులను గుర్తించి పన్ను వసూళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని, జీఎస్టీ సరళీకరణతో పాటు ఉపాధి కల్పనపై దృష్టి సారించాలని సూచించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories