Puri jagannath Ratna Bhandar: 46ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న రత్న భాండాగారం

Ratna Bhandagaram to open after 46 years
x

Puri jagannath Ratna Bhandar: 46ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న రత్న భాండాగారం

Highlights

Puri jagannath Ratna Bhandar: లోపలికి వెళ్లే టీమ్‌లో స్నేక్ క్యాచర్స్, మెడికల్ సిబ్బంది

Puri jagannath Ratna Bhandar: పూరీ జగన్నాథుడి ఆలయంలో దైవ సంపద బయటపడే సమయం ఆసన్నమైంది. మరో రెండు గంటల్లో రత్నా భాండాగారం తలుపులు తెరుచుకోనున్నాయి. ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీ ప్రకారం పూరీ జగన్నాథుడి సంపదను బయటకు తీయబోతోంది. ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీ ప్రకారం పూరీ జగన్నాథుడి సంపదను బయటకు తీసేందుకు సిద్ధమవగా.. జస్టిస్ విశ్వనాథ్‌ రథ్ అధ్యక్షతన 16 మంది సభ్యుల బృందం ఇందులో పాల్గొననుంది.

పూరీ జగన్నాథ ఆలయ కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. ఇందులో రెండు భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో అనేక మంది రాజులు సమర్పించిన వజ్ర, స్వర్ణ, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు నిధి పైభాగం ఛాంబర్ లో ఉంటాయి. మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు. లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందంటారు. పూరీ రాజుకు లొంగిపోయిన రాజుల వజ్ర వైడూర్యాలు, కెంపులు, మణులతో ఉన్న స్వర్ణ కిరీటాలెన్నో ఈ భాండాగారంలో ఉన్నాయనే టాక్ ఉంది. అయితే.. దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి.

రత్న భాండాగారంలోని ఆభరణాలకు సంబంధించిన మొదటి అధికారిక వివరణ 1805లో అప్పటి కలెక్టర్ చార్లెస్ ఆధ్వర్యంలో విడుదలైంది. ఆ సమయంలో భాండాగారంలో బంగారు, వెండి ఆభరణాలు.. 128 బంగారు నాణెలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణెలు, పలు వస్త్రాలు లభించాయి. ఆ తర్వాత 1978లో చివరగా రత్న భాండాగారం లెక్కలు బయటపడ్డాయి. అయితే 1978లో లోపలికి వెళ్లినప్పుడు చూసిన సంపదను నిపుణులు కూడా అంచనా వేయలేకపోయారని తెలుస్తోంది. 1982, 1985లో మరోసారి భాండాగారం తెరుచుకోగా.. అప్పటి లెక్కలను వెల్లడించలేదు.

కేరళలోని అనంతపద్మనాభ స్వామి అనంత సంపద గురించి, నేలమాళిగలు తెరవడం గురించి యావత్ ప్రపంచమంతా తీవ్ర ఉత్కంఠకు గురైంది. నాగబంధం వేసిన ఆరో గది చుట్టూ చిత్ర విచిత్రమైన ప్రచారాలు జరిగాయి. ఇప్పుడు కూడా జగన్నాథ రత్నబాండాగారం విషయంలో అలాంటి ప్రచారమే జరుగుతోంది. రత్న భాండాగారంలో ఏముంది.. భాండాగారంలో రహస్యంగా దాచిన సంపద బయటకు వస్తుందా? లోనికి వెళ్లడం అంత సులభమా? అన్న ఉత్కంఠ నెలకొంది.

జగన్నాథ రహస్యం చేదించాలంటే నాగ బంధాలు వేసిన తలుపులు ఎలా తెరుస్తారనే ఆసక్తి నెలకొంది. నాగబంధం వేసి ఉన్న తలుపులను బద్దలు కొట్టి లోపలికి ఎలా వెళ్తారని లోకమంతా ఎదురుచూస్తోంది. విషపూరిత సర్పాలు, కింగ్ కోబ్రాలు భాండాగారంలో ఉన్నాయంటూ పూరీ జగన్నాథ ఆలయ సంపద గురించి రాసిన పురణాలు, కథలలో ఉన్నాయి. 1985లో వెళ్లిన వారు మాత్రం పాములేవీ కనిపించలేదని తెలిపారు. అయితే పూరీ జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ కింద ఆలయ సుందరీకరణ పనులు చేపడుతున్న క్రమంలో ఆలయ పరిసరాల్లో పాములు కనిపించాయంటున్నారు అధికారులు. పురాతన ఆలయం కావడంతో చాలా చోట్ల చిన్న చిన్న రంధ్రాలు, పగుళ్లు గుర్తించారు. ఈ రంధ్రాల ద్వారా పాములు రత్నభండార్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని, అందుకే రత్న భండార్ తెరిచే సమయంలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు.

ఆలయ భాండాగారం ఓపెన్ చేసేందుకు ఒక టీమ్‌ను రెడీ చేసింది ప్రభుత్వం. అందులో ఆర్కియాలజీ నిపుణులతో పాటు... ఆలయ కమిటీ సభ్యులుంటారు. విషపూరిత సర్పాలు ఉన్నాయన్న నేపథ్యంలో పెద్ద పెద్ద పాములను సైతం అవలీలగా పట్టుకుని బంధించే పకడ్బందీ స్నేక్ క్యాచర్స్ ఉన్నారు. పాము ఏదైనా అన్ని రకాల విషాలకు విరుడుగా యాంటీ వీనమ్, అలాగే పాలీ వీనమ్ సీరమ్, ఇతర ఎమర్జెన్సీ మెడికల్ కిట్స్‌తో డాక్టర్లు కూడా ఈ బృందలో వెళ్తున్నారు. రత్న భండార్ ఇన్నర్ ఛాంబర్ తలుపులు డూప్లికేట్ కీతో ఓపెన్ కాకపోతే తాళం బద్దలు కొట్టే వారూ వెళ్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories