Ratan Tata's Health Condition: ఆరోగ్య పరిస్థితి విషమం అనే వార్తలపై స్పందించిన రతన్ టాటా

Ratan Tatas Health Condition: ఆరోగ్య పరిస్థితి విషమం అనే వార్తలపై స్పందించిన రతన్ టాటా
x
Highlights

Ratan Tata's Health Condition: రతన్ టాటా అనారోగ్యంపై మీడియాలో, సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ సంస్థ మాజీ...

Ratan Tata's Health Condition: రతన్ టాటా అనారోగ్యంపై మీడియాలో, సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ సంస్థ మాజీ చైర్మన్ అయిన రతన్ టాటాను ఆయన కుటుంబసభ్యులు రాత్రి 12.30 -1 గంట మధ్య ప్రాంతంలో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్పించారని... ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందనేది ఆ వార్తల సారాంశం. ముఖ్యంగా రతన్ టాటా బీపీ బాగా పడిపోయిందని, ప్రముఖ కార్డియాలజిస్ట్ డా షారుఖ్ అస్పి గోల్వాలా నేతృత్వంలోని నిపుణుల బృందం ఆయనకు చికిత్స అందిస్తోందని వార్తలొచ్చాయి.

అయితే, తాజాగా రతన్ టాటా స్వయంగా ఈ వార్తలపై స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తన ఆరోగ్యం విషమంగా ఉందని వస్తోన్న వార్తల్లో నిజం లేదని రతన్ టాటా స్పష్టంచేశారు. తాను రెగ్యులర్ హెల్త్ చెకప్ కోసమే ఆస్పత్రికి వచ్చానని ఆయన తేల్చిచెప్పారు.

వయస్సు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలే తప్ప అంతకుమించి తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రతన్ టాటా తన ప్రకటనలో పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితిపై లేనిపోని వదంతులు వ్యాపింపచేయొద్దని ఆయన మీడియాను, జనాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. స్వయంగా రతన్ టాటా చేసిన ఈ ప్రకటనతోనైనా ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వస్తోందని గాలి వార్తలకు ఫుల్‌స్టాప్ పడుతుందని ఆశిద్దాం.

Show Full Article
Print Article
Next Story
More Stories