Patanjali Coronil Kit: మళ్ళీ మార్కెట్ లోకి పతంజలి కరోనిల్ కిట్..

Patanjali Coronil Kit: మళ్ళీ మార్కెట్ లోకి పతంజలి కరోనిల్ కిట్..
x
Highlights

Patanjali Coronil Kit:కరోనా వైరస్ నివారణకు రాందేవ్ బాబా విడుదల చేసిన కరోనిల్ కిట్‌ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చిందని స్వయంగా ఆయనే ప్రకటించారు

Patanjali Coronil Kit: కరోనా వైరస్ నివారణకు రాందేవ్ బాబా విడుదల చేసిన కరోనిల్ కిట్‌ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చిందని స్వయంగా ఆయనే ప్రకటించారు. పతంజలి ఆయుర్వేద్ రూపొందించిన కరోనిల్ కిట్‌పై ఎటువంటి ఆంక్షలు లేవని, ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంటుందని యోగా గురు పేర్కొన్నారు. మీడియా సమావేశంలో రామ్‌దేవ్ బాబా మాట్లాడుతూ.. కరోనా నివారణకు పతంజలి సరైన విధంగా పని చేసిందని ఆయుష్ మంత్రిత్వ శాఖ కూడా అనుమతి రాం దేవ్ బాబా అన్నారు.

కరోనిల్ కిట్ మందుల కోసం లైసెన్స్‌ను ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ మంత్రిత్వ శాఖతో మాకు విభేదాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు, కరోనిల్, స్వాధారి, గిలోయ్, తులసి, అశ్వగంధపై ఎటువంటి ఆంక్షలు లేవని రాందేవ్ బాబా వెల్లడించారు.

ఈ స్వాసరి కరోనిల్ కిట్ దేశంలో ఎటువంటి చట్టపరమైన పరిమితులు లేకుండా లభిస్తాయని పేర్కొన్నారు. మెడిసిన్ పై ఎటువంటి ఆంక్షలు లేకుండా మార్కెట్ లోకి విడుదలకు అంగీకరించినందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖకు, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలిపారు రాం దేవ్ బాబా.

అయితే జూన్ నెలలో పతంజలి ఆయుర్వేద్ 'కోరోనిల్, స్వాసరి'ను మార్కెట్లోకి రావాల్సి ఉంది. అయితే కరోనా చికిత్సకు ఆయుర్వేద నివారణ అని పేర్కొంది. 100 మంది రోగులపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించగా.. 65 మందికి మూడు రోజుల్లో నెగి టివ్‌ ఫలితాలు వచ్చాయని వివరించారు. 7 రోజు ల్లో వంద శాతం మంది రోగులు కోలుకున్నా రని వెల్లడించారు. కోవిడ్‌-19ను నయం చేసే మాత్రలుగా పతంజలి చెప్పుకొస్తున్న 'కొరోనిల్‌'కు సంబంధించి ఎలాం టి ప్రకటనలు జారీ చేయవద్దని సదరు సంస్థను ఆదేశించింది.

ఈ మందుకు సంబంధించిన అన్ని వివరాలను, ఎక్కడ పరిశోధనాత్మక అధ్యయనం చేశారు.. ఈ మందు వేటితో తయారైంది.. శాంపిల్‌ పరిమాణంతో సహా అన్ని వివరాలను వెల్ డించాలని సంబంధిత మంత్రిత్వ శాఖ పతంజలి సంస్థకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కరోనా కట్టడి కోసం రాందేవ్ బాబా విడుదల చేసిన కరోనా కిట్ మార్కెట్ లో అందుబాటులోకి వచ్చిందని స్వయంగా ఆయనే ప్రకటించడం చర్చకు దారితీస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories