అయోధ్య ట్రస్టు ఖాతా నుంచి 6 లక్షల రూపాయలు స్వాహా

అయోధ్య ట్రస్టు ఖాతా నుంచి 6 లక్షల రూపాయలు స్వాహా
x
Highlights

అయోధ్యలో రామ్ ఆలయ నిర్మాణానికి నిధుల సేకరణ కోసం ఉద్దేశించిన శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ యొక్క బ్యాంకు..

అయోధ్యలో రామ్ ఆలయ నిర్మాణానికి నిధుల సేకరణ కోసం ఉద్దేశించిన శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ యొక్క బ్యాంకు ఖాతా నుండి అక్రమంగా రూ.6 లక్షల రూపాయలు డ్రా చేశారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.. దీనిపై అయోధ్య డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ దీపక్ కుమార్ స్పందించారు.. క్లోన్ చెక్కులను రూ .2.5 లక్షలు, రూ .3.5 లక్షలు ఉపయోగించి ఉపసంహరించుకున్నారని అన్నారు. ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్ఐఆర్) నమోదు చేసినట్టు ఆయన చెప్పారు. డబ్బును డ్రా చేసుకోవడానికి ఉపయోగించే అదే క్రమ సంఖ్యల ఒరిజినల్ చెక్కులు తమ వద్దే ఉన్నాయని ట్రస్ట్ అధికారులు ధృవీకరించారని దీపక్ కుమార్ చెప్పారు.

బుధవారం మధ్యాహ్నం మరోసారి భారీ ఎత్తున సొమ్ము డ్రా చేయడానికి ప్రయత్నం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘరానా మోసం వెనుక బ్యాంక్ సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సెప్టెంబరు 1 మరియు 3 తేదీలలో ఈ డబ్బును ఉపసంహరించుకోవడానికి రెండు క్లోన్ చెక్కులను ఉపయోగించినట్లు అధికారులు కనుగొన్నారు. దీంతో భారతీయ శిక్షాస్మృతి ప్రకారం ఐపిసి సెక్షన్లు 419 , 420 ,467, 468 , 471కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ఆయన చెప్పారు. కాగా విశ్వ హిందూ పరిషత్ ప్రాంతీయ ప్రతినిధి శరద్ శర్మ ఈ ఘటనను తీవ్రమైనదిగా పేర్కొన్నారు. "ఈ చెక్కుల క్లోనింగ్ కు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని.. శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిందని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories