Rajasthan Political Updates: పైలట్ కు ఊరట.. గెహ్లాట్ సర్కారుకు చుక్కెదురు

Rajasthan Political Updates: పైలట్  కు ఊరట.. గెహ్లాట్ సర్కారుకు చుక్కెదురు
x
Highlights

Rajasthan Political Updates: రాజస్థాన్‌లో రాజకీయ పోరు ఇప్పుడు కోర్టులో జరుగుతోంది. పైలట్ క్యాంప్‌లోని 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ అనర్హత నోటీసుపై...

Rajasthan Political Updates: రాజస్థాన్‌లో రాజకీయ పోరు ఇప్పుడు కోర్టులో జరుగుతోంది. పైలట్ క్యాంప్‌లోని 19 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ అనర్హత నోటీసుపై శుక్రవారం విచారణ ప్రారంభించిన న్యాయస్థానం‌ పైలట్‌ దాఖలు చేసిన పిటిషన్‌కు అనుమతినిచ్చింది.. ఈ విషయంలో కేంద్రాన్ని పార్టీగా చేర్చాలని పైలట్ క్యాంప్ చేసిన విజ్ఞప్తిని కోర్టు ఆమోదించింది. ఈ తీర్పుతో అనర్హత నోటీసులతో తిరుగుబాటు నేతలను మాజీలుగా చెయ్యాలన్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడినట్లయింది. దీనిపై విచారణను హైకోర్టు15 నిమిషాల పాటు వాయిదా వేసింది.

వాస్తవానికి, పదవ షెడ్యూల్ యొక్క రాజ్యాంగ ప్రామాణికతను తాము సవాలు చేశామని, అందువల్ల కేంద్రాన్ని పార్టీగా మార్చాలని పైలట్ గ్రూప్ హైకోర్టును కోరింది, కాబట్టి కేంద్రాన్ని పార్టీగా మార్చడం అవసరం అని కోర్టు పేర్కొంది. ఎమ్మెల్యేల అనర్హత నోటీసులపై ఈరోజు హోకోర్టు తన తుది తీర్పును వెలువరించనుంది. ఈ తీర్పు తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌కు అనుకూలంగా వస్తే మాత్రం అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం ఇరకాటంలో పడే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

కాగా అంతకుముందు, అనర్హత నోటీసుపై జూలై 21న వాదనలు వినింది, ఈ క్రమంలో హైకోర్టు తన నిర్ణయాన్ని జూలై 24 వరకు రిజర్వు చేసింది. అప్పటి వరకు ఈ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పీకర్ సిపి జోషిని ఆదేశించింది. హైకోర్టు ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా స్పీకర్ జోషి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్‌కు ఉపశమనం ఇవ్వడానికి గురువారం సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. దీనిపై హైకోర్టు తీర్పు ఇస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories