Rajasthan Political crisis: కేంద్రంపై రాజస్థాన్ సీఎం సంచలన ఆరోపణలు

Rajasthan Political crisis: కేంద్రంపై రాజస్థాన్ సీఎం సంచలన ఆరోపణలు
x
Highlights

Rajasthan Political crisis : గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సమావేశం అయ్యారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ శాసన...

Rajasthan Political crisis : గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సమావేశం అయ్యారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు, మద్దతు ఇస్తున్న పార్టీల శాసన సభ్యులు పాల్గున్నారు. రాజస్తాన్‌ రాజకీయాల్లో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌ కేంద్రంపై ఆరోపణలు చేసారు. కేంద్రం ఒత్తిడి కారణంగానే గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదని ఆరోపణలు చేశారు.

కర్ణాటక, మధ్యప్రదేశ్‌లలో ప్రభుత్వాలను కూల్చిన విధంగానే రాజస్తాన్‌లో కూడా బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు . అసెంబ్లీలో బల నిరూపణకు సిద్ధంగా ఉన్నామని ఎవరి బలమెంతో అక్కడే తేలుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా ఐకమత్యంగా ఉన్నారని మెజారిటీ నిరూపించుకుని తీరతామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఒత్తిడి వస్తున్న కారణంగానే గవర్నర్‌ తమను కలిసేందుకు అనుమతి ఇవ్వలేదన్న ఆయన రాజ్‌భవన్‌ను ప్రజలు ముట్టడిస్తే తాము బాధ్యత వహించబోమని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం అశోక్‌ గెహ్లోత్‌ ఆరోపణలను ఖండించారు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా.. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం సబబు కాదని వెల్లండించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories