Rajasthan: మాజీ సీఎం జగన్నాథ్ పహాడియా కరోనాతో మృతి

Rajasthan Former CM Jagannath Pahadia Dies of Coronavirus
x

Rajasthan: మాజీ సీఎం జగన్నాథ్ పహాడియా కరోనాతో మృతి

Highlights

Rajasthan: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనాతో కన్నుమూశారు.

Rajasthan: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ పహాడియా కరోనాతో కన్నుమూశారు. ఆయన వయసు 89 సంవత్సరాలు. హర్యానా, బీహార్‌కు గవర్నర్‌గానూ పనిచేసిన పహాడియా 1980-81 మధ్య రాజస్థాన్‌కు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన మృతిపై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణంతో షాక్‌కు గురయ్యానన్నారు. ఆయనకు మొదటి నుంచీ నాపై చాలా అభిమానం ఉందని, పహాడియా మరణం తనకు వ్యక్తిగతంగా నష్టమని ట్వీట్‌ చేశారు.

జగన్నాథ్ మృతికి సంతాప సూచకంగా గురువారం రాజస్థాన్ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలను మూసివేశారు. రాష్ట్ర ప్రభుత్వ గౌరవ లాంఛనాలతో జగన్నాథ్ అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. మాజీ సీఎంకు సంతాపం తెలిపేందుకు రాజస్థాన్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. పహాడియా రాజస్థాన్ రాష్ట్ర మొట్టమొదటి దళిత సీఎంగా నిలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories