రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం.. ‎ఇరువర్గాల ఎమ్మెల్యేలకు సోనియా పిలుపు..

Rajasthan Congress MLAs To Meet Sonia gandhi Today
x

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం.. ‎ఇరువర్గాల ఎమ్మెల్యేలకు సోనియా పిలుపు..

Highlights

Rajasthan: ఆలిండియా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించాయి.

Rajasthan: ఆలిండియా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు రాజస్థాన్ కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించాయి. రాజస్థాన్ కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఆలిండియా కాంగ్రెస్ అధ్యక్ష పదవికోసం ప్రయత్నిస్తున్న అశోక్‌ గెహ్లాట్‌ రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి పీఠంనుంచి అశోక్‌ గెహ్లాట్‌ తప్పుకునే నేపథ్యంలో తదుపరి సీఎం పదవిని సచిన్ పైలట్ చేపడుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే కొంతమంది ఎమ్మెల్యేలు సచిన్ పైలట్ నాయకత్వాన్ని అంగీకరించకపోవడంతో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి.

సీఎం అశోక్‌ గెహ్లాట్‌, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు భగ్గుమన్నాయి. రాజస్థాన్‌లో నెలకొన్న పరిణామాలు నాయకత్వ మార్పుకోసం హైడ్రామా కొనసాగుతోంది. రాజకీయ పరిణామాల్లో మార్పులు గంట గంటకూ మారుతున్నాయి. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది. రాజస్థాన్‌కు కొత్త ముఖ్యమంత్రిని ఎంపికచేయాలన్న అధిష్టాన నిర్ణయంతో సచిన్ పైలట్ వర్గీయులు, అశోక్‌ గెహ్లాట్‌ వర్గీయులు వేర్వేరుగా సమావేశమయ్యారు.

రాజస్థాన్‌ రాజకీయాల్లో చోటుచేసుకున్న పరిణామాలతో ఎమ్మెల్యేలు మూడు డిమాండ్లను అధిష్టానం ముందు ప్రతిపాదించారు. రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికను తాత్కాలికంగా వాయిదా వేయాలని, జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక తర్వాత రాజస్థాన్ సీఎం ఎంపిక ప్రక్రియ చేపట్టాలని ఎమ్మెల్యేలు అధిష్టానానికి సూచించారు. ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలనుకుంటే సచిన్ పైలట్ మినహాయించి ఎమ్మెల్యేల్లో ఎవరినైనా ప్రతిపాదిస్తే బలపరుస్తామని ఎమ్మెల్యేలు అంటున్నారు. లేదంటే అశోక్‌ గెహ్లాట్‌నే ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు. దీంతో రాజస్థాన్ సీఎం ఎంపిక ప్రక్రియను అక్టోబరు 19 నాటికి వాయిదా వేసినట్లు సమాచారం.

రాజస్థాన్ రాజకీయ పరిణామాలతో ఎమ్మెల్యేలతో చర్చించి సముచిత నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం నిర్ణయించింది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎమ్మెల్యేలను ఢిల్లీకి ఆహ్వానించింది. రాజకీయ సంక్షోభానికి గురిచేయవద్దని ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. సోనియా పిలుపుతో ఇటు అశోక్‌ గెహ్లాట్‌, సచిన్ పైలట్ వర్గీయులు ఢిల్లీ బయలుదేరనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories