తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారిన వాయుగుండం

Rains in Telugu states
x

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారిన వాయుగుండం

Highlights

* తెలంగాణ, ఏపీలో మోస్తరు వర్షాలకు అవకాశం.. దక్షిణ, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురిసే ఛాన్స్

Weather Report: రానున్న రెండ్రోజులు తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీన పడి నిన్న తీవ్ర అల్పపీడనంగా మారినట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయని, సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ వివరించింది. మరోపక్క చలి కాలం కావడం తుపాను ప్రభావంతో చలి తీవ్రత అధికంగా ఉండొచ్చని వాతావరణ నిపుణులకు చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను వణికించిన మాండూస్ తుపాను అల్పపీడనంగా బలహీనపడి నిన్న ఉపరితల ఆవర్తనంగా మారింది. దీని ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, రాయలసీమలలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories