ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మార్పులు.. జనవరి 1 నుంచి రైల్వే టికెట్‌ బుకింగ్‌ మరింత ఈజీ

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో మార్పులు.. జనవరి 1 నుంచి  రైల్వే టికెట్‌ బుకింగ్‌ మరింత ఈజీ
x
Highlights

కొత్త సంవత్సరం నుంచి రైల్వే శాఖ ప్రయాణికులకు టికెట్ల బుకింగ్‌ మరింత సులభం చేయనుంది. ఇందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఆధునీకరించింది. ఐఆర్ సీటీసీ...

కొత్త సంవత్సరం నుంచి రైల్వే శాఖ ప్రయాణికులకు టికెట్ల బుకింగ్‌ మరింత సులభం చేయనుంది. ఇందుకు వీలుగా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఆధునీకరించింది. ఐఆర్ సీటీసీ యాప్‌ను సైతం అప్‌గ్రేడ్‌ చేసింది. జనవరి 1 నుంచీ ఇవి అమల్లోకిరానున్నాయి. గురువారం అప్‌గ్రేడ్‌ చేసిన ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌, యాప్‌లకు కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ పచ్చజెండా ఊపారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఆరు కోట్లమందికిపైగా వినియోగిస్తున్నారు. రోజుకి సగటున ఏనిమిది లక్షలకుపైగా టికెట్లు బుక్‌ అవుతున్నాయి. రిజర్వ్‌డ్‌ టికెట్లలో 83 శాతం ఆన్‌లైన్‌ ద్వారానే బుక్‌ కావడం విశేషం.

యూజర్లు లాగిన్‌ అయ్యాక టికెట్లతోపాటే మీల్స్, రిటైరింగ్‌ రూమ్స్‌ వంటివి బుక్‌ చేసుకునేందుకు వీలుంటుంది.

* టికెట్‌ బుకింగ్‌ సమయంలో చెల్లింపుల పేజీలో ప్రయాణ వివరాలు డిస్‌ప్లే కానున్నాయి. టైపింగ్‌ తప్పులుంటే వెంటనే సరిదిద్దుకోవచ్చు. క్యాప్చాల వినియోగంతో సైబర్‌ సెక్యూరిటీకి వీలుంది.

* బుకింగ్ సమయంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా యూజర్‌ వెదుకుతున్న స్టేషన్లు లేదా ప్రయాణికుల వివరాలను వేగంగా అందిస్తుంది.

* ఇతర తేదీలలో సీట్ల లభ్యత వివరాలు సైతం పేజీలో ప్రత్యక్షం కానున్నాయి.

* రెగ్యులర్‌ లేదా ఫేవరెట్‌ ప్రయాణాలను ఎంపిక చేసుకోవడం ద్వారా వివరాలను ఆటోమాటిక్‌గా ఎంటర్‌ చేసుకోవచ్చు.

* ట్రయిన్‌ సెర్చ్‌, సెలక్షన్‌కు సంబంధించి అన్ని వివరాలూ ఇకపై ఒకే పేజీలో కనిపించనున్నాయి.

* బ్యాకెండ్‌లో క్యాచ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టడంతో సీట్ల అందుబాటు సమాచారంలో మరింత వేగంగా లోడింగ్‌కు అవకాశముంటుంది.

* వెదుకుతున్న రైళ్ల వివరాలు, అన్ని తరగతుల సీట్ల లభ్యత, ధరలు వంటివి ఒకే చోట దర్శనమివ్వనున్నాయి. పేజీని స్ర్కోల్‌ చేయడం ద్వారా బుక్‌ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. గతంలో ఒక్కో క్లిక్‌తో ఒక్కో ట్రయిన్‌ వివరాలను మాత్రమే తెలుసుకునేందుకు వీలుండేది.

* వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్లకు సంబంధించి సీటు ఖరారయ్యే(కన్ఫర్మేషన్‌) అవకాశాలను సైతం సూచిస్తుంది. గతంలో ఈ ఆప్షన్‌ను ప్రత్యేకంగా వెదకవలసి వచ్చేది.

* యూజర్‌ అకౌంట్స్‌ పేజీలో రిఫండ్‌ స్టేటస్‌ను అత్యంత సులభంగా పరిశీలించవచ్చు. గతంలో ఈ వివరాలను తెలుసుకోవడం కష్టమయ్యేది.

Show Full Article
Print Article
Next Story
More Stories