రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్‌ కొనుగోలులో ఆ టెన్షన్ ఉండదు..!

Railway Passengers Alert Railways Started Great Service now you can Buy Tickets without Waiting in Line
x

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్‌ కొనుగోలులో ఆ టెన్షన్ ఉండదు..!

Highlights

Indian Railway: ఇండియన్ రైల్వే అతిపెద్ద రవాణా సంస్థ. రోజు కొన్ని కోట్ల మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంది...

Indian Railway: ఇండియన్ రైల్వే అతిపెద్ద రవాణా సంస్థ. రోజు కొన్ని కోట్ల మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంది. భారతదేశంలో మొత్తం 12,167 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయి. దేశంలో ప్రతిరోజూ 23 మిలియన్ల మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు. అయితే రైలులో ప్రయాణించాలంటే టికెట్ కావాలి. స్టేషన్లలో టిక్కెట్లు పొందడానికి పొడవైన క్యూలో నిలబడవలసి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. భారతీయ రైల్వే ప్రత్యేక సేవను ప్రారంభించింది. దీని కింద రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు లేదా సాధారణ టిక్కెట్లను కొనుగోలు చేయడానికి టిక్కెట్ కౌంటర్ వద్ద నిలబడాల్సిన అవసరం లేదు.

IRCTC డిజిటల్ చెల్లింపు ప్రదాత Paytmతో కలిసి డిజిటల్ టికెటింగ్‌ను సులభతరం చేసింది. ప్రయాణీకులు ఆటోమేటిక్ టిక్కెట్ వెండింగ్ మెషీన్స్ (ATVM) ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయగలరు. రైల్వే ప్రయాణీకులలో నగదు రహితాన్ని ప్రోత్సహించడానికి ATVMలలో యూపీ ద్వారా టికెట్ సేవలకు డిజిటల్‌గా చెల్లించే అవకాశాన్ని కల్పించింది. భారతదేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఇప్పటికే ATVM మెషీన్లు ఉన్న సంగతి తెలిసిందే.

మీరు QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా టికెట్లని కొనుగోలు చేయవచ్చు. రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసిన ATVMలు టచ్-స్క్రీన్ ఆధారిత టికెటింగ్ కియోస్క్‌ల ద్వారా ఈ పని చాలా సులభం అవుతుంది. స్క్రీన్‌పై రూపొందించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా ప్రయాణికులు సాధారణ టిక్కెట్లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లను కొనుగోలు చేయవచ్చు. ఇది కాకుండా మీరు రైల్వే పాస్‌లని కూడా పునరుద్దరించుకోవచ్చు. స్మార్ట్ కార్డ్‌లను కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. Paytm ప్రయాణీకులకు విభిన్న చెల్లింపు ఎంపికలను అందిస్తుంది. వీటిలో Paytm UPI, Paytm వాలెట్, Paytm పోస్ట్‌పెయిడ్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆప్షన్స్ ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories