Railway Minister Ashwini Vaishtav: ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్టవ్ కీలక వ్యాఖ్యలు

Railway Minister Ashwini Vaishtav key Comments on the Odisha Train Accident
x

Railway Minister Ashwini Vaishtav: ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్టవ్ కీలక వ్యాఖ్యలు 

Highlights

Railway Minister Ashwini Vaishtav: సిగ్నలింగ్ సమస్య వల్లే ప్రమాదం జరిగిందని మంత్రి వివరణ

Railway Minister Ashwini Vaishtav: ఒడిశా రైలు ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్టవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒడిశా రైలు ఘటన ప్రమాదం కాదని..సిగ్నలింగ్‌లో మార్పులు చేసినందువల్లే ఘటన జరిగినట్లు మంత్రి తెలిపారు. సిగ్నలింగ్‌లో మార్పులు చేసిన వ్యక్తులను గుర్తించామని..త్వరలోనే వారిపై చర్యలు ఉంటాయని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ట్రాక్ పునరుద్దరణ పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి అశ్విని వైష్టవ్...మరో 3 రోజుల్లో పునరుద్దరణ పనులను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.

ఒక ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంపై రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా కూడా వివరణ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాగింగ్ సిస్టంల మార్పులు చేసినందువల్లే రైలు ప్రమాదం జరిగినట్లు గుర్తించామని రైల్వే బోర్డు మెంబర్ జయవర్మ సిన్హా స్పష్టం చేశారు. సిగ్నలింగ్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసినందువల్లే....మెయిన్ ట్రాక్‌లోకి వెళ్లాల్సిన కోరమాండల్ ఎక్స్‌ప్రెసర్ లూప్‌లైన్‌లోకి వెళ్లడంవల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించామన్నారు. ప్రమాదానికి ఓవర్ స్పీడ్ కారణంకాదన్నారు. ప్రమాద సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్..ప్రమాద సమయంలో సిగ్నలింగ్ వ్యవస్థలో మార్పులు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories