Railway Job 2021: రైల్వేలో 16000 పోస్టులు.. ఈ రోజే చివ‌రితేదీ..

Railway Job 2021: 16000 Posts in Railways Deadline Today
x

రైల్వే ఉద్యోగాలకు నోప్టిఫికేషన్లు విడుదల (ఫైల్ ఇమేజ్)

Highlights

Railway Job 2021: నిరుద్యోగులు అల‌ర్ట్.. రైల్వేలో 16000 పోస్టుల‌కు ఈ రోజే చివ‌రితేది.

Railway Job 2021: నిరుద్యోగులు అల‌ర్ట్.. రైల్వేలో 16000 పోస్టుల‌కు ఈ రోజే చివ‌రితేది. అర్హులైన అభ్య‌ర్థులు ఎవ‌రైనా ఉంటే వెంట‌నే అప్లై చేసుకోండి. వెంట‌నే అధికారిక వెబ్‌సైట్‌ని సంద‌ర్శించి నోటిఫికేష‌న్ త‌నిఖీ చేయండి. రైల్వే వివిధ జోన్లకు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దక్షిణ మధ్య రైల్వే, తూర్పు రైల్వే, పశ్చిమ మధ్య రైల్వేతో సహా వివిధ జోన్లలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

దక్షిణ మధ్య రైల్వే అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్

దక్షిణ మధ్య రైల్వే ద్వారా అప్రెంటీస్‌ల ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 4 అక్టోబర్ 2021 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ scr.indianrailways.gov.in ద్వారా 3 నవంబర్ 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 4103 పోస్టులను భర్తీ చేస్తున్నారు.

తూర్పు రైల్వే రిక్రూట్‌మెంట్

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ తూర్పు రైల్వేలో అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 4 అక్టోబర్ 2021 నుంచి కొనసాగుతోంది. అభ్యర్థులు ఈ పోస్టులకు అధికారిక వెబ్‌సైట్ www.rrcer.com ద్వారా 3 నవంబర్ 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 3366 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

వెస్ట్ సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టుల భర్తీ

అదేవిధంగా పశ్చిమ మధ్య రైల్వేలో అప్రెంటీస్ పోస్టుల రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 11 అక్టోబర్ 2021 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ wcr.indianrailways.gov.in ద్వారా 10 నవంబర్ 2021 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 2226 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

అర్హత

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సి) జారీ చేసిన నోటీసు ప్రకారం.. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10, 12వ ఉత్తీర్ణత కలిగి ఉండటం తప్పనిసరి. అలాగే అభ్యర్థి సంబంధిత స్ట్రీమ్‌లో ITI డిగ్రీని కలిగి ఉండాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories