రాహుల్ పట్టాభిషేకానికి మార్గం సుగమం చేసిన సోనియా.. సీనియర్లకు ఉధ్వాసన..

రాహుల్ పట్టాభిషేకానికి మార్గం సుగమం చేసిన సోనియా.. సీనియర్లకు ఉధ్వాసన..
x
Highlights

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీకి పట్టాభిషేకం చేయడానికి సోనియా గాంధీ స్వయంగా మార్గం సుగమం చేశారు. తాత్కాలిక అధ్యక్షురాలి..

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీకి పట్టాభిషేకం చేయడానికి సోనియా గాంధీ స్వయంగా మార్గం సుగమం చేశారు. తాత్కాలిక అధ్యక్షురాలి హోదాలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా పార్టీని పునర్నిర్మాణం చేసి రాహుల్ అనుచర జట్టుకు అవకాశం కల్పించారు. వృద్ధ నాయకులను ప్రధాన కార్యదర్శి పదవి నుండి తప్పించారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని కొత్తగా ఏర్పాటు చేశారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడంలో సోనియాకు సహాయం చేయడానికి 6 మంది నాయకులతో కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పుడు రాహుల్ గాంధీ పట్టాభిషేకానికి, పార్టీలో కొత్త మార్పులకు మార్గం సుగమం చేస్తుంది.

ఈ కమిటీలో సోనియా గాంధీకి అత్యంత విశ్వాసపాత్రులైన అహ్మద్ పటేల్, మాజీ రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ, ప్రధాన కార్యదర్శులు కెసి వేణుగోపాల్ , ముకుల్ వాస్నిక్ ఉన్నారు. పార్టీ ప్రతినిధి రణదీప్ సుర్జేవాలాకు అతిపెద్ద ప్రమోషన్ లభించింది. ఆయనను ప్రధాన కార్యదర్శిగా నియమించడమే కాకుండా ఈ కమిటీలో కూడా చోటు కల్పించారు. వయస్సు రీత్యా ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించబడిన అంబికా సోనీకి కూడా ఈ కమిటీలో స్థానం లభించింది. మరోవైపు కొత్త సిడబ్ల్యుసిలో గులాం నబీ ఆజాద్, అంబికా సోని, మల్లికార్జున్ ఖర్గేలను మాత్రం అలాగే ఉంచారు. దిగ్విజయ్ సింగ్‌ను సిడబ్ల్యుసిలో పర్మనెంట్ ఇన్విటేషనల్‌లో చేర్చారు.

Also Read : ఉత్తర కొరియాలో రోగి కనిపిస్తే కాల్చివేత‌..

గులాం నబీ ఆజాద్, మోతీలాల్ వోరా, అంబికా సోని, మల్లికార్జున్ ఖర్గే, లుయిజిన్హో ఫెలారియోలను ప్రధాన కార్యదర్శులుగా తొలగించారు. వీరిలో, ఆగస్టు 7న సోనియా గాంధీకి లేఖలు రాసిన 23 మంది నాయకులలో గులాం నబీ ఒకరు. ఈ లేఖలో కాంగ్రెస్ కు తాత్కాలికం కాకుండా పూర్తికాల నాయకత్వాన్ని డిమాండ్ చేశారు.. అయితే ఆ తరువాత రాహుల్ గాంధీ ఆగ్రహానికి గురయ్యారు. పూర్తికాల నాయకత్వం, చురుకుదనం వంటి పదాలను ఉపయోగించడంతో రాహుల్ ఫైర్ అయ్యారు. అయితే శుక్రవారం పాత జట్టులో కొంతమందిని తొలగించిన సోనియా గాంధీ.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, ప్రధాన కార్యదర్శి పదవులకు కొత్త నియామకాలు చేయడం ద్వారా తన ఉద్దేశాలను స్పష్టం చేశారు. ఇక మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ రెండేళ్ల తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు సంపాదించారు. అదే సమయంలో, ఇటీవల రాజస్థాన్‌లో పార్టీ నుండి తిరుగుబాటు చేసిన సచిన్ పైలట్‌ను ఖాళీగా ఉంచారు. పార్టీలో ఆయనకు ఏ బాధ్యత ఇవ్వలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories