Rahul Gandhi: కూలీ చొక్కా.. బ్యాడ్జి ధరించి కూలీలతో కలిసి సూట్‌కేసు మోసిన రాహుల్‌ గాంధీ

Rahul Gandhi Visits Anand Vihar Railway Station Meet Collie Bharat Jodo Yatra
x

Rahul Gandhi: కూలీ చొక్కా.. బ్యాడ్జి ధరించి కూలీలతో కలిసి సూట్‌కేసు మోసిన రాహుల్‌ గాంధీ

Highlights

Rahul Gandhi: కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్న రాహుల్‌

Rahul Gandhi: ఢిల్లీ రైల్వే కూలీలు గతంలో తనను కలవాలని చేసిన వీడియోపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. సడెన్‌గా రైల్వే స్టేషన్‌లో ప్రత్యక్షమై కూలీల రాహుల్‌ షాకిచ్చారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో పోర్టర్‌లను కలిసిన రాహుల్‌ కూలీ అవతారం ఎత్తారు. కూలీ చొక్కా ధరించి.. చేతికి బ్యాడ్జి పెట్టుకుని తలపై సూట్‌కేసు మోస్తూ కూలీల్లో ఒకడిగా కలిసి పోయారు.

రైల్వే స్టేషన్‌లో కూలీలు, కార్మికులతో ఇంటరాక్ట్‌ అయిన రాహుల్‌ గాంధీ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే రైల్వే కూలీల కష్టాలు తీర్చుతానని రాహుల్‌ హామీ ఇచ్చారు. వయనాడ్‌ ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి సాధారణ కూలీలా సామాన్లు మోయడాన్ని చూసేందుకు కూలీలు, ప్రయాణీకులు ఆసక్తి చూపారు..రాహుల్‌కు అనుకూలంగా కూలీలు చేసిన నినాదాలతో రైల్వే స్టేషన్‌ పరిసరాలు మారుమోగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories