Rahul Gandhi: బెంగాల్ డాక్టర్ అత్యాచార ఘటనపై స్పందించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi reacts to Bengal doctors rape incident
x

Rahul Gandhi: బెంగాల్ డాక్టర్ అత్యాచార ఘటనపై స్పందించిన రాహుల్ గాంధీ 

Highlights

Rahul Gandhi: ఎక్స్‌ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ

Rahul Gandhi: వెస్ట్ బెంగాల్‌లో జూనియర్ డాక్టర్‌పై హత్యాచార ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ఎక్స్‌ వేదికగా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణంతో యావత్ దేశం ఉలిక్కిపడిందని, వైద్యవర్గాలు, మహిళల్లో అభద్రతా వాతావరణం నెలకొందని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. నిర్భయ కేసు తర్వాత కఠిన చట్టాలు వచ్చినప్పటికీ ఇలాంటి నేరాలను నిలువరించడంలో ఎందుకు విఫలం అవుతున్నామంటూ ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు. హాథ్రస్ నుంచి ఉన్నావ్‌, కథువా నుంచి కోల్‌కతా వరకు.. ఇలా వెలుగులోకి వస్తోన్న ఘటనలపై ప్రతిపార్టీ, సమాజం తీవ్ర చర్చ జరపాలి. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. బెంగాల్‌ హత్యాచార కేసులో బాధిత కుటుంబానికి ఎట్టిపరిస్థితుల్లోనూ న్యాయం జరగాలని, దోషులకు తగిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories