Parliament: మోడీ, అదానీ మాస్కులతో కాంగ్రెస్ ఎంపీలు.. రాహుల్ పరిహాసం..!

Rahul Gandhi Mock Interview With PM Modi and Adani
x

Parliament: మోడీ, అదానీ మాస్కులతో కాంగ్రెస్ ఎంపీలు.. రాహుల్ పరిహాసం..!

Highlights

Parliament: పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు వినూత్న నిరసన చేపట్టారు. అదానీ వ్యవహారంపై విచారణ జరిపించాలని అదానీ, మోడీ మాస్కులతో ఇద్దరు ఎంపీలు దర్శనమిచ్చారు.

Parliament: పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు వినూత్న నిరసన చేపట్టారు. అదానీ వ్యవహారంపై విచారణ జరిపించాలని అదానీ, మోడీ మాస్కులతో ఇద్దరు ఎంపీలు దర్శనమిచ్చారు. వారిని విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పరిహాసం చేయడం అందరినీ ఆకర్షించింది. కాంగ్రెస్ ఎంపీలు మాణికం ఠాగూర్, సప్తగిరి శంకర్ ఉలక.. ప్రధాని మోడీ, గౌతమ్ అదానీ మాస్కులు ధరించారు. వారి ఫొటోలు తీస్తూ మీ మధ్య ఉన్న సంబంధాన్ని వివరించండి అంటూ రాహుల్ గాంధీ వారిని ప్రశ్నించాడు. దానికి వారు ఏం చేసినా మేం కలిసే చేశాం.. మాది ఏళ్లనాటి బంధం అని సమాధానమిచ్చారు. పార్లమెంటు కార్యకలాపాలు ఎందుకు ఆగిపోయాని రాహుల్ గాంధీ మరో ప్రశ్న అడిగారు. ఇవాళ అమిత్ భాయ్ అదృశ్యమయ్యారు. సభకు రాలేదు అని జవాబిచ్చారు. ఇక ప్రధాని మాస్క్ లో ఉన్న కాంగ్రెస్ ఎంపీని చూపిస్తూ తాను ఏది చెబితే అది చేస్తాడు అని అదానీ మాస్క్ తో ఉన్న మరో ఎంపీ అంటారు. ఇవి పార్లమెంటు ఆవరణలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

ఇకపోతే పార్లమెంటు శీతాకాల సమావేశాలను అదానీ వ్యవహారం కుదిపేస్తోంది. సమావేశాలు ప్రారంభం అయినప్పటినుంచి వాయిదాల పర్వం కొనసాగుతోంది. గౌతమ్ అదానీపై నమోదైన కేసు విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు పార్లమెంటులో నిరసనలు వ్యక్తం చేశారు. జాయింట్ పార్లమెంటరీ విచారణను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండగా.. జార్జ్ సోరోస్ ఫౌండేషన్‌కు కాంగ్రెస్ అగ్రనేత సోనియాకు మధ్య ఆర్థిక సంబంధాలున్నాయని బీజేపీ చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. దీనిపై సోమవారం పార్లమెంటులోనూ గందరగోళం నెలకొంది. ఈ విషయంపై చర్చ జరపాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. రాజకీయాలకు అతీతంగా దీనిపై చర్చ జరిపేందుకు ముందుకు రావాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కోరారు.


Show Full Article
Print Article
Next Story
More Stories