Rahul Ghandi: ఆక్సిజన్, ప్రజారోగ్యసేవలపై దృష్టి సారించండి..కేంద్రంపై రాహుల్ ఫైర్

Rahul Ghandi File photo
x

రాహుల్ గాంధీ ఫైల్ ఫోటో

Highlights

Rahul Ghandi:అనవసరంగా ఖర్చు చేయడానికి బదులుగా వ్యాక్సిన్లు, ఆక్సిజన్, ప్రజారోగ్య సేవలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.

Rahul Ghandi: కోవిడ్-19 విజృంభిస్తున్న తరుణంలో అనవసరమైన ప్రాజెక్టులపై ఖర్చులెందుకని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనవసరంగా ఖర్చు చేయడానికి బదులుగా వ్యాక్సిన్లు, ఆక్సిజన్, ప్రజారోగ్య సేవలపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారాయన. టెస్ట్‌లు జరగడం లేదని, వ్యాక్సిన్లు అందుబాటులో లేవని, ఆక్సిజన్ కొరత వేధిస్తోందని, ఐసీయూ బెడ్స్ అందుబాటులో లేవని దేశమంతా ఇదే పరిస్థితి ఏర్పడిందని రాహుల్‌ ట్విట్టర్‌లో తెలిపారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో మూడు సెక్రటేరియల్ బిల్డింగ్స్ నిర్మాణం కోసం బిడ్స్‌ను ఆహ్వానించిన వార్తలున్న క్లిప్పింగ్స్‌ను ట్వీట్‌కు జతచేశారు రాహుల్‌గాంధీ.

Show Full Article
Print Article
Next Story
More Stories