Rafale fighter jet: జెట్ త్వరలోనే భారత్ అమ్ములపొదిలోకి..ఆరు రఫేల్ యుద్ధ విమానాలు

Rafale fighter jet:  జెట్ త్వరలోనే భారత్ అమ్ములపొదిలోకి..ఆరు రఫేల్ యుద్ధ విమానాలు
x
Highlights

Rafale fighter jet: దేశ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది. జూన్ 15న గాల్వన్‌ లోయలో భారత్ - చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే.

Rafale fighter jet: దేశ సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుంది. జూన్ 15న గాల్వన్‌ లోయలో భారత్ - చైనా సైన్యం మధ్య జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. డ్రాగన్‌ వర్గాలు మాత్రం ఎంత మంది సైనికులు హతమయ్యారో అసలు నోరు విప్పలేదు. ఈ విషయంలో మౌనమే పాటిస్తున్నారని పేర్కొన్నాయి. అయితే కనీసం 43 చైనా సైనికులు మరణించగా.. వారి మృతదేహాలను హెలికాప్టర్లలో తరలించారని తెలుస్తోందని భారత వర్గాలు తెలిపాయి. గత 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా భారత్, చైనా మధ్య జరిగిన ఈ ఘర్షణల్లో భారీగా ప్రాణ నష్టం సంభవించింది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లో వాయుసేన స్థావరంలో గత వారం చైనాకు చెందిన ఐఎల్‌-78 ట్యాంకర్‌ విమానాన్ని ఇండియా గుర్తించింది.

ఈ నేపథ్యంలో భారత్ సరిహద్దులో బలగాల సంఖ్యను పెంచడంతో పాటు అస్త్రశస్త్రాలను తరలిస్తోంది. అత్యవసర కొనుగోళ్లకు కూడా సిద్ధమైంది. రఫేల్‌ యుద్ధ విమానాలను ఫ్రాన్స్‌ నుంచి త్వరగా తెప్పించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గతంలో భారత్ నాలుగు విమానాలను కోరింది తాజాగా.. భారత్‌ మొత్తం ఆరు విమానాలను ఇవ్వాలని ఫ్రాన్స్‌ను కోరుతోంది. దీనికి ఫ్రాన్స్‌ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. జులై నెల ఆఖరులోగా అత్యాధునిక క్షిపణులను అమర్చిన రఫేల్‌ యుద్ధ విమానాలు భారత్‌కు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 8 విమానాలు సిద్ధమై, సర్టిఫికేషన్‌ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 8 విమానాలు సిద్ధమై, సర్టిఫికేషన్‌ దశలో ఉన్నట్లు సమాచారం. భారతీయ పైలట్లకు రఫేల్ విమానాలపై శిక్షణ కొనసాగుతోంది. భారత్‌లోని అంబాలా వాయుసేన స్థావరానికి వారే అక్కడి నుంచి విమానాలనుచేర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఎస్‌-400 గగనతల రక్షణ వ్యవస్థను కూడా వీలైనంత తొందరగా భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం రష్యా పై ఒత్తిడి చేస్తుంది. రష్యా ముందుగా సరఫరా చేస్తామన్న సమయం కంటే ముందే ఇవ్వాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కోరారు. భారత్‌కు అవసరమైన బిలియన్‌ విలువైన అదనపు ఆయుధ సామగ్రిని కూడా కొన్ని వారాల్లో సరఫరా చేసేందుకు రష్యా అంగీకరించింది.

కాగా.. సరిహద్దుల్లో ఉద్రికత్తలు తగ్గించేందుకు ఇకపై రెండు దేశాలు ప్రతి వారం చర్చలు జరపనున్నాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ని తూర్పు లద్దాఖ్‌లో డ్రాగన్‌ దుందుడుకు వైఖరి కొనసాగిస్తున్న నేపథ్యంలో సంప్రదింపులు, డబ్ల్యూఎంసీసీ కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.తూర్పు లద్దాఖ్‌లో చైనా దుందుడుకు వైఖరి అంశంపై చర్చించేందుకు ప్రతి వారం సహకార చర్చలు సమావేశాలకు అంగీకారం కుదిరింది. ఈ చర్చలకు

భారత్ తరపున ప్రతినిధులుగా విదేశాంగ, రక్షణ, హోం శాఖ, సైనిక బలగాల సభ్యులు ఉంటారు. గత వారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన డబ్ల్యూఎంసీసీ సమావేశంలో లద్దాఖ్‌లో సమస్యల పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించామని పేర్కొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories