Puri jagannath Ratna Bhandar: తెరుచుకున్న పూరీ జగన్నాథ రత్న భాండాగారం.. దేశం చూపు మొత్తం అక్కడే!

Puri Jagannath Temple Ratna Bhandar Opened
x

Puri jagannath Ratna Bhandar: తెరుచుకున్న పూరీ జగన్నాథ రత్న భాండాగారం.. దేశం చూపు మొత్తం అక్కడే!

Highlights

Puri jagannath Ratna Bhandar: కాసేపట్లో భాండాగారం నుంచి బయటకు రానున్న సంపద

Puri jagannath Ratna Bhandar: జగన్నాథ రహస్యం ఛేదించేందుకు రంగం సిద్ధమైంది. ఉత్కంఠ రేపిన రత్న భాండాగార ప్రవేశ ఘట్టం పూర్తైంది. స్వర్ణ, రత్న, వజ్రాలతో కూడిన జగన్నాథుడి సంపద కాసేపట్లో బయటకు రానుంది. ఆ సంపద విలువ ఎంతనేది త్వరలోనే తేలనుంది.

పూరి జగన్నాథుడి రత్న భాండాగారం.. నాలుగున్నర దశాబ్దాలుగా ఎన్నో రకాల చర్చలు.. ప్రచారాలు.. వివాదాలకు కేంద్రమైంది. అందులోని అపార సంపద ఉందంటూ ఎన్నో అంచనాలు.. ఆపై ఆ సంపదఉందా లేదా అంటూ అనుమానాలు.. ఇలా ఎన్నో చర్చల నడుమ ఆ భాండాగారంలో ఏముందనే ఉత్కంఠ భక్తుల్లో క్రమంగా పెరిగింది. ఈ నేపథ్యంలో జస్టిస్ విశ్వనాథ్ పర్యవేక్షణలో ఏర్పడిన హైపవర్ కమిటీ భాండాగారం తలపులు తెరిచేందుకు సిద్ధమై.. 11 మందితో కూడిన టీమ్‌‌తో ఆపరేషన్‌ను సక్సెస్ చేసింది.

12వ శతాబ్దం నాటి పురాతన భాండాగారాన్ని మరమ్మతు చేపట్టనుంది ఆర్కియాలజీ విభాగం. ఈ నేపథ్యంలో అందులోని సంపదని ఆలయంలోని రెండు చోట్లలో భద్రపరిచేందుకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అందుకోసం భారీ ఎత్తున చెక్కపెట్టెలను కూడా తరలించింది. ముందుగా మరమ్మతులు చేసేందుకు ప్రాధాన్యత ఇస్తుండగా.. భాండాగారంలోని సంపద లెక్కింపు ప్రక్రియకు మరింత సమయం పట్టనున్నట్టు తెలుస్తోంది. హైపవర్ కమిటీ పర్యవేక్షణలో, హై సెక్యురిటీ నడుమ లెక్కింపు జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక నాలుగున్నర దశాబ్దాల అనంతరం భాండాగారం తెరుచుకోవడంతో.. ఆలయం దగ్గరకు భారీగా భక్తులు చేరుకున్నారు. భక్తులు అధికసంఖ్యలో రావడంతో ఆలయ పరిసరాల్లో భద్రత పెంచారు అధికారులు.

పూరీ జగన్నాథ ఆలయ కింది భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది. 12వ శతాబ్దంలో అనేక మంది రాజులు సమర్పించిన వజ్ర, స్వర్ణ, రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయి. ఆలయంలో రోజువారీ పూజలు నిర్వహించేందుకు అవసరమైన నగలు పైభాగం ఛాంబర్ లో ఉంటాయి. లోపలి భాగంలో వెలకట్టలేనంత సంపద ఉందంటారు. పూరీ రాజుకు లొంగిపోయిన రాజుల వజ్ర వైడూర్యాలు, కెంపులు, మణులతో ఉన్న స్వర్ణ కిరీటాలెన్నో ఈ భాండాగారంలో ఉన్నాయనే ప్రచారం ఉంది.

రత్న భాండాగారంలోని ఆభరణాలకు సంబంధించిన మొదటి అధికారిక వివరణ 1805లో అప్పటి కలెక్టర్ చార్లెస్ ఆధ్వర్యంలో విడుదలైంది. ఆ సమయంలో భాండాగారంలో బంగారు, వెండి ఆభరణాలు.. 128 బంగారు నాణెలు, 24 బంగారు కడ్డీలు, 1297 వెండి నాణెలు, పలు వస్త్రాలు లభించాయి. ఆ తర్వాత 1978లో చివరగా రత్న భాండాగారం లెక్కలు బయటపడ్డాయి. అయితే 1978లో లోపలికి వెళ్లినప్పుడు చూసిన సంపదను నిపుణులు కూడా అంచనా వేయలేకపోయారని తెలుస్తోంది. 1982, 1985లో మరోసారి భాండాగారం తెరుచుకోగా.. అప్పటి లెక్కలను వెల్లడించలేదు. 46 ఏళ్ల అనంతరం భాండాగారం తెరుచుకోవడంతో అందులోని సంపద విలువ ఎంతనే ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories