Congress: రెండు రాష్ట్రాల్లోనూ సీఎంలను మార్చాలని నేతల డిమాండ్

Punjab And Chhattisgarh Leaders Demands Change The Both Chief Ministers
x

భూపేష్ బఘేల్‌ - టీఎం సింగ్‌డియో (ఫైల్ ఫోటో)

Highlights

* అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతున్న పార్టీ

Congress Party: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఆ పార్టీ సంక్షోభంలో పడింది. పార్టీ అంతర్గత విభేదాలతో కొట్టుమిట్టాడుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులను మార్చాలన్నదే ఆ పార్టీ నేతల ప్రధాన డిమాండ్‌. పంజాబ్‌ సీఎం పదవి నుంచి అమరీందర్‌ సింగ్‌ను తొలగించాలని ఐదుగురు మంత్రులతో సహా 31 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. వారంతా ఆ రాష్ట్ర మంత్రి రజీందర్‌సింగ్‌ బజ్వా నివాసంలో సమావేశమయ్యారు. అమరీందర్‌ పార్టీ నాయకుల విశ్వాసం కోల్పోయారని, ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని పార్టీ అధిష్ఠానవర్గానికి తెలియజేయాలని నిర్ణయించారు.పంజాబ్ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధు ఈ సమావేశానికి హాజరుకాలేదు.

ఛత్తీ‌స్‌గఢ్‌లో రొటేషన్‌ ఫార్ములా ప్రకారం అక్కడ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌ను మార్చాలన్నది ఆ రాష్ట్రమంత్రి టీఎం సింగ్‌డియో డిమాండ్ చేశారు. 2018లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రెండున్నరేళ్లు భూపేష్ బఘేల్ సీఎంగా ఉంటారని తర్వాత ఆ బాధ్యతలు తనకు అప్పగిస్తారని హామీ ఇచ్చినట్లు డియో చెప్పారు. వీరిద్దరు కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories