Condoms and ORS packets: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కస్టమర్స్‌కు కండోమ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్

Condoms and ORS packets: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కస్టమర్స్‌కు కండోమ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్
x
Highlights

Pune pub sends condoms and ORS packets to its customers for New Year 2025 Party: న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌కు కస్టమర్స్‌ను ఎట్రాక్ట్ చేయడానికి...

Pune pub sends condoms and ORS packets to its customers for New Year 2025 Party: న్యూ ఇయర్ 2025 సెలబ్రేషన్స్‌కు కస్టమర్స్‌ను ఎట్రాక్ట్ చేయడానికి పబ్స్, క్లబ్స్ వినూత్నంగా ఆలోచించడం కొత్తేం కాదు. కొన్ని పబ్స్ కస్టమర్స్‌కు విదేశీ మద్యం ఆఫర్ చేస్తామంటాయి. ఇంకొన్ని పబ్స్ న్యూ ఇయర్ పార్టీ తర్వాత డ్రంకెన్ డ్రైవింగ్ ఇబ్బందులు లేకుండా పికప్, డ్రాపింగ్ ఏర్పాట్లు చేస్తాయి. కానీ ఇక్కడ ఒక పబ్ వాళ్లు తమ కస్టమర్స్ కోసం ఏకంగా కండోమ్స్, ఓఆర్ఎస్ పాకెట్స్ పంపించిందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై జనం నుండి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

పూణేలో జరిగిన ఈ ఘటనపై మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ లీడర్ అక్షయ్ జైన్ స్పందిస్తూ ఆ పబ్ పూణే పరువు తీసిందంటున్నారు. ఒక పబ్ తమ రెగ్యులర్ కస్టమర్స్‌కు పంపించే ఇన్విటేషన్‌తో పాటు అందులో కండోమ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ( Condoms and Oral Rehydration Solution (ORS) పంపించినట్లు తెలిసిందన్నారు. ఈ ఘటనపై పూణే పోలీసులు సైతం దృష్టి సారించారు. ఆ పబ్ నుండి ఇన్విటేషన్ అందుకున్న గెస్టుల నుండి పూణె పోలీసులు మరిన్ని వివరాలు రాబడుతున్నారు.

ఈ ఘటనపై పూణెలోని ముంద్వా పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ నీల్‌కంఠ్ జగ్‌తాప్ స్పందించారు. ఆ పబ్ నిర్వాహకులు తమ రెగ్యులర్ గెస్టులకు పంపించిన ఇన్విటేషన్ తో పాటు అందులో ఒక అడ్వైజరీ కూడా ఉన్నట్లు తెలిపారు. హెల్మెట్స్ ఉపయోగించాల్సిందిగా సూచించడంతో పాటు అతిగా మద్యం తాగడం వల్ల బాడీ డీహైడ్రేట్ అవకుండా ఓఆర్ఎస్ తీసుకోవాల్సిందిగా అందులో సూచించారు. అలాగే మరో 40 మందికి ఆహ్వానాలతో పాటు కండోమ్స్ ప్యాకెట్స్ కూడా పంపించినట్లు తెలిసిందని ఇన్‌స్పెక్టర్ నీల్‌కంఠ్ జగ్‌తాప్ తెలిపారు.

పూణే నగరానికి ఉన్న పేరు చెడగొట్టేలా పబ్స్ వ్యవహరిస్తున్నాయని కాంగ్రెస్ నేత అక్షయ్ జైన్ ఆందోళన వ్యక్తంచేశారు. న్యూ ఇయర్ పార్టీకి కండోమ్స్ పంపించే విష సంస్కృతి ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్నించారు. ఇలాంటి పబ్స్‌పై ప్రభుత్వం నిఘా పెట్టకపోతే వాటి వల్ల ఇక్కడి యువత చెడిపోయే ప్రమాదం ఉందన్నారు. పబ్ నిర్వాహకులు పంపించిన ఇన్విటేషన్‌ను ఒక వ్యక్తి ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ఈ ఓఆర్ఎస్, కండోమ్స్ ప్యాకెట్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హై స్పిరిట్స్ అనే పబ్ ఇలా కండోమ్స్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ (High Spirits pub in Pune faces allegations of sending condoms and ORS packets) పంపించినట్లు ఆరోపణలు ఎదుర్కుంటోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories