ISRO: కౌంట్‌డౌన్ షురూ.. మరోసారి చరిత్ర సృష్టించేందుకు ఇస్రో రెడీ..

PSLV C59 is Ready to Launch ESA’s PROBA 3 Satellites
x

ISRO: కౌంట్‌డౌన్ షురూ.. మరోసారి చరిత్ర సృష్టించేందుకు ఇస్రో రెడీ..

Highlights

Proba-3 Mission Satellites: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయింది. భానుడి రహస్యాలను చేధించేందుకు సర్వం సన్నద్ధమైంది.

Proba-3 Mission Satellites: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయింది. భానుడి రహస్యాలను చేధించేందుకు సర్వం సన్నద్ధమైంది. ప్రోబా - త్రీ గా పిలిచే ఉపగ్రహాన్ని PSLV-C 59 ద్వారా ప్రయోగించేందుకు ముహురం ఖరారు చేసింది ఇస్రో.... తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఈరోజు మధ్యాహ్నం 4 గంటల 8 నిమిషాలకు అంతరిక్షంలోకి ప్రొబా - త్రీని ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఇస్రోకి అచ్చొచ్చిన వాహక నౌక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ సీరీస్ - సీ 59 నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనుంది. సుమారు 550 కిలోల అత్యంత బరువు కలిగిన శాటిలైట్ హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్‌‌గా ఇస్రో వెల్లడించింది.

సౌర కుటుంబంలో అనేక పరిశోధనలు కొనసాగిస్తున్న ఇస్రో... ఈ ప్రయోగం ద్వారా సౌర సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇన్ ఆర్బిట్‌ డెమానిస్ట్రేషన్ లక్ష్యంగా ప్రోబా - త్రీని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీతో కలిసి కక్ష్యలోకి పంపనున్నట్లు వెల్లడించింది. ప్రోబా - త్రీ మిషన్‌లో ప్రయోగించిన శాటిలైట్లు కృత్రిమ సూర్యగ్రహణ పరిస్థితులను సృష్టించనున్నాయి. ఈ మిషన్‌లో కరొనాగ్రాఫ్, అక్యుల్టర్ అనే రెండు స్పేస్ క్రాఫ్టులు ఉంటాయని ఇస్రో తెలిపింది. సూర్యుడి వాతావరణంలోని బయటి, అత్యంత వేడిపొర అయిన సోలార్ కొరోనాను ఈ మిషన్ అధ్యయనం చేయనుంది. ఈ శాటిలైట్లలో ఒకటి సూర్యుడిని కనిపించకుండా కృత్రిమ గ్రహణం సృష్టిస్తే.. మరొకటి కొరోనాను గమినించనుంది.

గతంలో ఆదిత్య ఎల్‌ - వన్ మిషన్‌ను చేపట్టిన ఇస్రో... తాజాగా.. ప్రోబా - త్రీ మిషన్‌ ప్రయోగించబోతోంది. వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో భాగస్వాములయ్యారు. మిషన్‌ ప్రయోగం బాధ్యతలను ఇస్రో తీసుకుంటుండగా.. శాటిలైట్‌ను నింగిలోకి విజయవంతమైన రాకెట్‌ పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌ తీసుకెళ్లనుంది.

రెండేళ్ల విరామం అనంతరం ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ సహకారంతో ప్రోబా - త్రీని ప్రయోగించబోతున్నారు. మిషన్‌లో భాగంగా 550 కిలోల బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉంచనున్నట్లు ఇస్రో పేర్కొంది. ఇది సంక్లిష్ట కక్ష్యలోకి ఖచ్చితత్వంతో ప్రయోగం నిర్వహించేందుకు విశ్వసనీయతను పీఎస్‌ఎల్‌వీ బలోపేతం చేస్తుందని పేర్కొంది.

మిషన్‌లో భాగంగా యూరోపియన్‌ ఏజెన్సీ సూర్యుడి వాతావరణంలోని బయటి, అత్యంత వేడిపొర అయిన సోలార్‌ కరోనాను అధ్యయనం చేయనుంది. ఈ మిషన్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఉపగ్రహాలు నిర్ణీత కక్ష్యలోకి చేరుకోవడం కీలకం. ఇందులో ఒకదానితో మరొకటి సమన్వయం చేసుకుంటూ కరోనాపై అధ్యయనం చేస్తాయి. ఇందులో ఏ ఒక్కటి పనిచేయకపోయినా రెండో శాటిలైట్‌కు ఉపయోగం లేకుండాపోతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories