Priyanka Gandhi: నిన్న పాలస్తీనా.. ఇవాళ బంగ్లాదేశ్ బ్యాగ్‌తో పార్లమెంటుకు ప్రియాంక

Priyanka Gandhi Carries Stand With Bangladesh Minorities bag to Parliament
x

Priyanka Gandhi: నిన్న పాలస్తీనా.. ఇవాళ బంగ్లాదేశ్ బ్యాగ్‌తో పార్లమెంటుకు ప్రియాంక

Highlights

Priyanka Gandhi: ప్రియాంక గాంధీ వాద్రా పలు అంశాలపై వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు.

Priyanka Gandhi: ప్రియాంక గాంధీ వాద్రా పలు అంశాలపై వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నారు. నిన్న పాలస్తీనా బ్యాగ్‌తో పార్లమెంట్‌కు హాజరైన ప్రియాంక.. ఇవాళ బంగ్లాదేశ్ బ్యాగ్‌లో కనిపించారు. బంగ్లాదేశ్ లో హిందువులు, ఇతర మైనార్టీలపై దాడుల నేపథ్యంలో వారికి మద్దతుగా నిలవాలన్న స్లోగన్ రాసి ఉన్న బ్యాగ్‌‌తో లోక్ సభకు వెళ్లారు.. ప్రియాంక(Priyanka Gandhi)తో పాటు ఇతర ప్రతిపక్ష ఎంపీలు కూడా అలాంటి బ్యాగులనే ధరించి పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు.

సోమవారం లోక్ సభ జీరో అవర్‌లో ప్రియాంక మాట్లాడుతూ బంగ్లాదేశ్‌(Bangladesh)లో మైనార్టీలపై జరుగుతున్న దారుణాలపై గొంతెత్తాలని కోరారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు, క్రిస్టియన్ల భద్రతపై ఢాకాతో దౌత్యపరమైన సంప్రదింపులు జరపాలని కోరారు. అయితే ప్రియాంకగాంధీ వరసగా పాలస్తీనా, బంగ్లాదేశ్ పేర్లతో కూడిన బ్యాగులను ధరించి పార్లమెంటుకు రావడం తీవ్ర చర్చనీయంశంగా మారింది. దీనిపై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని సమస్యల కంటే విదేశాల్లోని ఆందోళనలకే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడుతున్నారు. దీనిపైన స్పందించిన ప్రియాంక. తాను ఎలాంటి దుస్తులు ధరించాలో ఎవరు నిర్ణయిస్తారని ప్రశ్నించారు. తనకు నచ్చినవే ధరిస్తానని చెప్పుకొచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories