Atal Tunnel Rogtang : ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని (అటల్ టన్నెల్) హిమాలయ పర్వత సానువుల్లో నిర్మించిన విషయం తెలిసిందే. అయితే...
Atal Tunnel Rogtang : ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గాన్ని (అటల్ టన్నెల్) హిమాలయ పర్వత సానువుల్లో నిర్మించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎదురుచూస్తున్న సొరంగ మార్గాన్ని శనివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. ఆ తరువాత కాసేపు ఆ సొరంగ మార్గంలో సరదాగా నడిచుకుంటూ తిరిగారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ ఉన్నారు.
ఇక ఈ సొరంగ మార్గాన్ని 9.2 కిలోమీటర్ల విస్తీర్ణంలో హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలి-లేహ్ జాతీయ రహదారిపై లాహౌల్-స్పిటీ జిల్లాలో రోహ్తంగ్ పాస్ వద్ద నిర్మించారు. గతంలో ఈ మార్గాన్ని రోహ్తంగ్ టన్నెల్ అని పిలిచేవారు. కానీ 2019 డిసెంబరు 24 తేదీన అటల్ టన్నెల్‌గా పేరు మార్చారు. దేశ ప్రధాని పదవిలో అటల్ బిహార్ వాజ్‌పేయీ ఉన్న సమయంలో అంటే 2000 జూన్ 3న ఈ సొరంగ మార్గం నిర్మించేందుకు నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత సరిగ్గా రెండేళ్ల తర్వాత అంటే 2002 మే 26 తేదీన ఈ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అయితే ఈ సొరంగ మార్గాన్ని అధికారులు ఆరేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా వాతావరణ పరిస్థతులు మరి కొన్ని కారణాలతో నిర్మాణం కాస్త ఆలస్యం అయింది. అయితే గత కొద్ది రోజుల క్రితమే ఈ సొరంగ మార్గం అందుబాటులోకి రావడంతో శనివారం ప్రధాని నరేంద్రమోడి దాన్ని ప్రారంభించారు. ఇక ఈ నిర్మాణంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) కీలక పాత్ర పోషించింది.
ఇక ఈ సొరంగ మార్గం విశేషాల్లోకెళితే ఇది సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఈ సొరంగ మార్గ నిర్మాణికి సుమారుగా రూ.3,300 కోట్లు ఖర్చు అయింది. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన సొరంగ మార్గాల్లో ఇదే అత్యంత పొడవైంది. ఈ సొరంగ మార్గంలో ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్, 60 మీటర్లకు అగ్ని మాపక వ్యవస్థ, 500 మీటర్లకు అత్యవసర మార్గం, 250 మీటర్లకు సీసీ కెమెరా, 2.2 కి.మీ.లకు వెలుతురు ప్రసరించే వ్యవస్థ, 1 కి.మీ.కు గాలి నాణ్యతను పరీక్షించే వ్యవస్థ లాంటి సౌకర్యాలు ఉంటాయి. అంతే కాదు సరిహద్దుల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా ఈ సొరంగం ద్వారా సైనిక వాహనాల్లో సామగ్రిని త్వరితగతిన తరలించ డానికి వీలుగా ఉంటుంది. ఈ సొరంగంతో మనాలి - లేహ్‌ల మధ్య 46 కి.మీ. దూరం తగ్గనుంది. ఈ సొరంగ మార్గం హిమాచల్ ప్రజలకూ ఎంతో ప్రయోజనకరం. సాధారణంగా అక్కడ ఆరు నెలల పాటు దట్టంగా కురిసే మంచు వల్ల స్థానికులకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire