రైతులను తప్పుదోవ పట్టించొద్దు..వారి జీవితాలతో ఆడుకోవద్దు: ప్రధాని మోడీ

రైతులను తప్పుదోవ పట్టించొద్దు..వారి జీవితాలతో ఆడుకోవద్దు: ప్రధాని మోడీ
x
Highlights

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయ్. మూడింటిని రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని అన్నదాతలు అంటుంటే.. కొత్త...

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయ్. మూడింటిని రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేది లేదని అన్నదాతలు అంటుంటే.. కొత్త చట్టాల వల్ల నష్టం జరిగే ప్రసక్తే లేదని మోడీ మరోసారి చెప్పారు. కొంతమంది రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని... వారి జీవితాలతో ఆడుకోవద్దని ప్రధాని ఫైర్ అయ్యారు.

కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళనలు కొనసాగుతున్నాయ్. మూడు చట్టాలను రద్దు చేసే వరకు నిరసనలు విరమించేది లేదని.. వణికించే చలిని సైతం లెక్కచేయకుండా రోడ్డుపైనే ఉండిపోతున్నారు. పంజాబ్ రైతుల మొదలుపెట్టగా.. మిగతా రాష్ట్రాల నుంచి కూడా అన్నదాతలు వచ్చి చేరుతున్నాయ్. దీంతో హస్తిన సరిహద్దులు రణరంగాన్ని తలపిస్తున్నాయ్. ఇప్పటికే రైతు సంఘాల నేతలతో కేంద్రం పలు దఫాలు చర్చలు జరిపింది. ఐతే చట్టాలను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేస్తున్నారు. ఐతే సూచనలు, సలహాలు స్వీకరిస్తామని.. రద్దు కుదరని కేంద్రం అంటుండడంతో ప్రతిష్టంభన అలానే కొనసాగుతోందిప్పుడు !

కొత్త చట్టాల వల్ల రైతులకు నష్టం జరిగే ప్రసక్తే లేదని ప్రధాని మోడీ అంటున్నారు. దేశంలో ఏ ఒక్క రైతూ భూమిని కోల్పోయే అవకాశం లేదని ఆయన భరోసా ఇచ్చారు. సాగు చట్టాల నెపంతో కొందరు రాజకీయాలు చేస్తున్నారంటూ విపక్షాలపై మండిపడ్డారు. రైతుల జీవితాలతో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కిసాన్‌ కల్యాణ్‌ సమ్మేళన్‌ పేరుతో మధ్యప్రదేశ్‌లో జరిగిన కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న మోడీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆందోళనల ముసుగులో కొంతమంది తమ రాజకీయ ఎజెండాను అందులోకి జొప్పిస్తున్నారని ఫైర్ అయ్యారు

పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం ద్వారా రైతులకు అందించే పెట్టుబడి సాయం కింద ప్రధాని 18వేల కోట్లు విడుదల చేశారు ప్రధాని మోడీ... పశ్చిమ బెంగాల్‌, కేరళ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బెంగాల్‌లోని దాదాపు 70లక్షల మంది రైతులకు పీఎం కిసాన్‌ నిధులు అందకుండా సీఎం మమతా బెనర్జీ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రైతులకు లబ్ధి చేకూర్చే కేంద్ర పథకాలను అడ్డుకుంటూ ఆమె రాజకీయాలు చేస్తున్నారన్నారు. కేరళలో ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న పార్టీలు స్వార్థం కోసం పంజాబ్‌ రైతులతో జత కడుతున్నాయని మోడీ విమర్శలు గుప్పించారు.

గత ప్రభుత్వాల విధానాల వల్ల 80శాతం మంది పేద రైతులు మరింత పేదరికంలోకి కూరుకుపోయారని మోడీ అన్నాు. దీనికోసమే వ్యవసాయ రంగంలో సంస్కరణలు చేపట్టాల్సి వస్తోందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కనీస మద్దతు ధరను అనేక పంటలకు విస్తరించామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories