కరోనా వెంటాడుతోందని మర్చిపోవద్దు : మోడీ

కరోనా వెంటాడుతోందని మర్చిపోవద్దు : మోడీ
x
Highlights

ప్రధాని మోడీ జాతినుద్ధేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో రికవరీ రేటు బావుందన్నారు.

ప్రధాని మోడీ జాతినుద్ధేశించి ప్రసంగించారు. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ లో రికవరీ రేటు బావుందన్నారు. భారత్ లో 10 లక్షల కేసుల్లో.. కేవలం 83 మరణాలు మాత్రమే సంభవిస్తున్నాయన్నారు. కోవిడ్ ను దేశం సమర్థవంతంగా ఎదుర్కొందన్న మోడీ.. పండుగల వేళ నిర్లక్ష్యం వహించవద్దన్నారు. దేశంలో కొంత మంది వైరస్‌ను తేలిగ్గా తీసుకుంటున్నారని.. మాస్క్‌ ధరించకపోతే ఇతరులను కూడా కరోనా వెంటాడుతోందని మర్చిపోవద్దని హెచ్చరించారు.

మరోవైపు కరోనా వ్యాక్సిన్ కు సంబంధించి దేశ ప్రజలకు ప్రధాని గుడ్ న్యూస్ చెప్పారు. వ్యాక్సిన్ ప్రయోగాలు కీలకు దశకు చేరుకున్నాయన్నారు. వ్యాక్సిన్‌పై భారత్‌లో గట్టి రీసెర్చ్‌ జరుగుతోందన్న మోడీ.. వ్యాక్సిన్‌ కోసం యుద్ధప్రాతిపదికన ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు. అలాగే వ్యాక్సిన్‌ వచ్చే వరకు కరోనాపై పోరాటం ఆగదని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories