President Ram Nath Kovind donates Rs 20 lakh to Army hospital : ఆర్మీ హాస్పిటల్‌కు రాష్ట్రపతి 21లక్షల విరాళం!

President Ram Nath Kovind donates Rs 20 lakh to Army hospital : ఆర్మీ హాస్పిటల్‌కు రాష్ట్రపతి 21లక్షల విరాళం!
x
President Ram Nath Kovind donates Rs 20 lakh to Army hospital
Highlights

కార్గిల్ యుద్ధంలో పోరాడిన సైనికులకు నివాళిగా, భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు (ఆదివారం) ఢిల్లీ ఆర్మీ

President Ram Nath Kovind donates Rs 20 lakh to Army hospital to buy equipment to combat Covid-19 : కార్గిల్ యుద్ధంలో పోరాడిన సైనికులకు నివాళిగా, భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు (ఆదివారం) ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రికి రూ .20 లక్షలు విరాళంగా ఇచ్చారు. కరోనాని సమర్ధవంతంగా ఎదురుకోవడానికి అత్యాధునికమైన ఉపయోగపడుతుందని, తద్వారా వారు ఎక్కువ మంది ప్రజలకు సేవ చేయగలుగుతారని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు అధికారులు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.

రాష్ట్రపతిగా మూడేళ్లు:

రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవిని స్వీకరించి శనివారం నాటికి మూడేళ్ళు అవుతుంది, . దేశ ప్రథమ పౌరుడిగా కరోనాపై పోరాటంలో ప్రజలకు మార్గదర్శకుడిగా రాష్ట్రపతి నిలిచారు. కరోనా పోరులో భాగంగా అయన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్‌ ఫండ్‌కి ఒక నెల జీతంతో పాటుగా ఏడాదిపాటు 30% జీతాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు. రాష్ట్రపతిగా మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుసుకున్న కోవింద్‌కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయిడుతో పాటుగా పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఇక అటు భార‌త స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన కార్గిల్‌లో పాకిస్థాన్ దురాక్రమ‌ణ‌ల‌కు పాల్పడింది. ఈ ప్రాంతంలో 1999, జూలై 26న పాకిస్తాన్‌పై భారత సైన్యం విజయం సాధించింది. ఈ విజయానికి గుర్తుగా ప్రతిఏడాది కార్గిల్ విజయ్ దివస్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో పాటుగా పలువురు రాజకీయ నాయకులు అమరవీరులకు నివాళులర్పించారు. ఆనాటి యుద్ధంలో ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రాణాలర్పించిన సైనికులకు శ్రధ్ధాంజలి ప్రక‌టించారు. కార్గిల్ విజయాన్ని అందించిన సైనికుల బలిదానం ఎల్లప్పుడూ మనకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories