సుష్మా స్వరాజ్‌కు కేంద్రం అరుదైన గౌరవం

సుష్మా స్వరాజ్‌కు కేంద్రం అరుదైన గౌరవం
x
Highlights

దివంగత నేత సుష్మా స్వరాజ్‌కు కేంద్రం అరుదైన గౌరవన్ని కల్పించింది. దేశానికి ఆమె చేసిన సేవలకి గాను ప్రవాసీ భారతీయ కేంద్ర'కు గాను సుష్మా స్వరాజ్ పేరు పెట్టాలని నిర్ణయించింది.

దివంగత నేత సుష్మా స్వరాజ్‌కు కేంద్రం అరుదైన గౌరవన్ని కల్పించింది. దేశానికి ఆమె చేసిన సేవలకి గాను ప్రవాసీ భారతీయ కేంద్ర'కు గాను సుష్మా స్వరాజ్ పేరు పెట్టాలని నిర్ణయించింది. 'ప్రవాసీ భారత కేంద్ర'కు సుష్మా స్వరాజ్ భవన్‌‌గా మార్చడంతోపాటు ఫారిన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌ను సుష్మా స్వరాజ్ ఫారిన్ సర్వీస్ ఇన్‌స్టిట్యూట్‌గా మార్చాలని కేంద్రం నిర్ణయించినట్టుగా కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఫిబ్రవరి 14న ఆమె తొలి జయంతి సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

సుష్మా స్వరాజ్ ఫిబ్రవరి 14, 1952 న జన్మించారు. . 1970లో రాజకీయ రంగప్రవేశం చేసిన సుష్మా విద్యార్థి సంఘం నాయకురాలిగా ఉంటూ ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి 1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర శాసనసభలో కాలుపెట్టారు. 1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఢిల్లీకి తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఇక 2014 లో ప్రధాని మొదటి క్యాబినెట్ లో కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశారు. విదేశాంగ మంత్రిగా ఆమె విశేషమైన సేవలను అందించారు. ఆమె అనారోగ్య కారణాల వల్ల ఆమె గత ఏడాది ఆగస్టు 6న తుదిశ్వాస విడిచారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories