పంజాబ్ సీఎం ప్రధాన సలహాదారుడిగా ప్రశాంత్‌ కిశోర్

Prashant Kishor is the Chief Advisor to Punjab
x

ఫైల్ ఇమేజ్


Highlights

Punjab: ప్రశాంత్‌ కిశోర్‌ నియామకానికి పంజాబ్‌ కేబినెట్ ఆమోదముద్ర వేసిందని సీఎంవో కార్యాలయం ట్వీట్‌ చేసింది.

Panjab: రాజకీయ చాణక్యుడిగా పేరొందిన ప్రశాంత్‌ కిశోర్‌కు పంజాబ్ సీఎం కీలక బాధ్యతలు అప్పగించారు. తన ప్రధాన సలహాదారుడిగా పీకేను నియమించారు అమరీందర్‌సింగ్‌. నాలుగేళ్ల క్రితం పంజాబ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్‌ విజయం సాధించేందుకు ప్రశాంత్‌ కిశోర్‌ తన వంతు ప్రయత్నం చేశారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత మరోసారి పంజాబ్‌లోని తన వ్యూహాలను అమలు చేయబోతున్నారు.

తనకు ఎంతో సంతోషంగా ఉందని ట్విట్టర్‌ పంజాబ్ సీఎం...

తన ప్రధాన సలహాదారుడిగా ప్రశాంత్ కిశోర్‌ను నియమించినట్లు తెలియజేయడానికి తనకు ఎంతో సంతోషంగా ఉందని ట్విట్టర్‌ ద్వారా అమరీందర‌ సింగ్ తెలిపారు. పంజాబ్‌ ప్రజల అభివృద్ధి కోసం ప్రశాంత్‌తో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నానని చెప్పారు అమరీందర్‌సింగ్. ప్రశాంత్‌ కిశోర్‌ నియామకానికి పంజాబ్‌ కేబినెట్ ఆమోదముద్ర వేసిందని సీఎంవో కార్యాలయం ట్వీట్‌ చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories