Pranab Mukherjee Health Update : నిలకడగానే ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం!

Pranab Mukherjee Health Update : నిలకడగానే ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం!
x

Pranab Mukherjee

Highlights

Pranab Mukherjee Health Update : భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌

Pranab Mukherjee Health Update : భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యం నిలకడగా ఉందని ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.. ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదని హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్‌ సోకడంతో ప్రస్తుతం వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్య సిబ్బంది వెల్లడించింది. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ప్రణబ్‌కు ఈనెల 10వ తేదీన శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జరిపిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోంది. ప్రణబ్‌ ముఖర్జీ 2012 నుండి 2017 వరకు భారతదేశ 13 వ రాష్ట్రపతిగా పనిచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories