Gujarat polls: గుజరాత్‌లో 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌.. బరిలో 19 జిల్లాల్లో 788 మంది అభ్యర్థులు..

Polling for 89 Assembly Seats in Gujarat
x

Gujarat polls: గుజరాత్‌లో 89 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌.. బరిలో 19 జిల్లాల్లో 788 మంది అభ్యర్థులు..  

Highlights

Gujarat polls: గుజరాత్‌లో తొలి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది

Gujarat polls: గుజరాత్‌లో తొలి దశ ఎన్నికల ప్రచారం ముగిసింది. అయితే నిన్నమొన్నటివరకు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్యే ముఖాముఖి పోటీ ఉండేది. రాష్ట్రంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ రాకతో త్రిముఖ పోటీ అనివార్యమయింది. అయితే గిరిజన ప్రాంతాల్లో భారతీయ ట్రైబల్‌ పార్టీ గట్టి పోటీ ఇస్తోంది. కాగా.. బీజేపీ తరఫున ప్రధాని మోడీ ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ వ్యూహకర్త, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్‌ నేతలు ఎన్నికల సభల్లో పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా తమ అభ్యర్థుల తరఫున రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ గుజరాత్‌తో ప్రచారం చేస్తున్నారు.

182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో మొదటి విడతలో దక్షిణ గుజరాత్‌, కచ్‌ - సౌరాష్ట్ర ప్రాంతాల్లోని 19 జిల్లాల్లోని 89 స్థానాలకు రేపు పోలింగ్‌ జరుగనుంది. మిగతా 93 స్థానాలకు డిసెంబర్ 5వ తేదీన ఎన్నికలు జరుగనున్నాయి. తొలి దశలో జరుగుతున్న ఎన్నికల బరిలో బీజేపీ సీనియర్‌ నేతలు పురుషోత్తం సోలంకీ, కువర్జీ బవాలియా, క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా, ఆమ్‌ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థి ఇసుదాన్‌ గఢ్వీ, ఆప్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా సహా 788 మంది అభ్యర్థులు ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories