Bengal: బెంగాల్‌లో పొలిటికల్ హీట్

Bengal: Political Heat In Bengal
x

ఫైల్ ఇమేజ్ 

Highlights

Bengal:పోటాపోటీ ర్యాలీలకు సిద్ధమైన బీజేపీ, టీఎంసీ * ఇవాళ బెంగాల్‌లో ప్రధాని మోడీ భారీ ర్యాలీ

Bengal: ఎన్నికల సమీపిస్తోన్న కొద్ది బెంగాల్‌‌లో ఎన్నికల యుద్ధం మొదలైంది.. ఎవరికి వారు తమదైన శైలీలో ప్రచారం చేస్తున్నారు. టికెట్ రాని వారు వలస వెళ్లిపోతున్నారు. కొత్తవారికి టికెట్‌ ఇస్తున్నారు. తమ భవితవ్యం తేల్చుకునేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రత్యర్థుల్ని ఢి కొట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఎన్నికలకు ఎవరి వ్యూహాలు వారివి.. గెలుపుపై ఎవరి ధీమా వారిదే కానీ, అందరి చూపు ఇప్పుడు బెంగాల్‌వైపే చూస్తున్నాయి. ఎన్నికలకు నెలల ముందే ఉత్కంఠభరితంగా సాగిన రాజకీయ పరిణామాలు ఎలక్షన్‌ డేట్ దగ్గర పడే కొద్దీ మరింత రసవత్తరంగా సాగుతున్నాయి.

బెంగాల్‌లో ఎన్నికల యుద్ధం మరింత రక్తి కట్టింది. నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీపై మాజీ మంత్రి సువేందు అధికారిని బరిలోకి దింపింది బీజేపీ.. గెలుపు నాదంటే నాదే అంటూ ఇద్దరు నేతలు చెబుతున్నారు. ఓ వైపు మూడోసారి అధికారం చేజిక్కించుకునేందుకు దీదీ‌‌.. మరోవైపు ఎలా అయినా ఈసారి బెంగాల్‌లో గద్దెక్కాలని కాషాయదళం పట్టుదలతో ఉన్నాయి.. టీఎంసీ నేతలు వరుసగా బీజేపీకి క్యూ కట్టినా.. తగ్గేది లేదంటూ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు మమతా బెనర్జీ.

మిగతా రాష్ట్రాల ఎన్నికలు ఎలా ఉన్నా.. బెంగాల్ ఎన్నికల్లో ఇప్పుడు అందరి కళ్లు నందిగ్రామ్‌పైనే ఉన్నాయి. గెలుపు ఎవిదన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నందిగ్రామ్ తన కంచుకోట అని ప్రకటించారు సువేందు అధికారి. అందుకే 200 శాతం మమత ఓటమీ ఖాయమన్నారు. నందిగ్రామ్‌తో మమతకు ఎలాంటి సంబంధాలులేవని, ఆమె ఔట్ సైడర్ అని విమర్శించారు.. ఇక ఈ సారి తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌ను కాదని.. సువేందు సవాల్‌కు ప్రతి సవాల్ విసిరారు మమతా బెనర్జీ. కేవలం నందిగ్రామ్ స్థానం నుంచే పోటీ చేసేందుకు డిసైడ్ అయ్యారు. అటు బీజేపీ కూడా ఈ స్థానంలో సువేందు అధికారిని నిలబెట్టింది. దీంతో త్వరలో జరిగే మినీ ఎలక్షన్ వార్‌లో స్పాట్‌లైట్‌గా మారనుంది నందిగ్రామ్‌‌.

అటు బీజేపీ కూడా ఈసారి అదే రేంజ్‌లో పోటీకి దిగుతోంది. ప్రధాని మోడీ ఆదివారం ప్రచార శంఖారావం పూరించనుండగా.. కీలక నేతలంతా బెంగాల్‌లో పర్యటించేలా ప్లాన్‌ చేస్తోంది కమలం పార్టీ. బెంగాల్‌పై స్పెషల్‌ ఫోకస్ పెట్టిన బీజేపీ మునుపెన్నడూ లేని విధంగా భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది. 7 లక్షల మంది ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశాలున్నాయి. దీంతో బెంగాల్ చరిత్రలో ఇది అతిపెద్ద ర్యాలీ కాబోతుందంటున్నారు బీజేపీ నేతలు.

ఇక ఈ సమావేశానికి సెలబ్రిటీలను కూడా ఆహ్వానించింది బీజేపీ. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్‌ గంగూలీ, యాక్టర్‌ మిథున్‌ చక్రవర్తి ర్యాలీలో పాల్గొననున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఇప్పటికే బెంగాల్ పాలిటిక్స్‌ వేడెక్కగా తాజాగా మిథున్ చక్రవర్తి ప్రధానితో వేదిక పంచుకోబుతున్నారనే వార్తలు ఆసక్తికరంగా మారాయి. గతంలో టీఎంసీ తరపున రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన మిథున్ చక్రవర్తి, బీజేపీలో చేరతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అటు టీఎంసీలో టికెట్ రాని అసంతృప్తులు కూడా బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మొత్తానికి గెలుపు ధీమాపై ఎవరికి వారు ఉన్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో బెంగాల్ దంగల్ మరింత వేడేక్కింది. మరి చూడాలి బెంగాల్ గడ్డ మీద మూడో సారి దీదీ జెండా ఎగుర వేస్తుందా..? లేదంటే కాషాయ దళం అందుకుంటుందో తెలియాలంటే మే 2 వరకు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories