పీఎన్‌బీలో మరో భారీ స్కాం వెలుగులోకి

పీఎన్‌బీలో మరో భారీ స్కాం వెలుగులోకి
x
Highlights

ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ .1,203.26 కోట్లకు..

ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ .1,203.26 కోట్లకు కుచ్చుటోపీ పెట్టినట్లు బహిర్గతం అయింది. అహ్మదాబాద్ జోనల్ కార్యాలయంలోని కార్పోరేట్ శాఖలో ఈ భారీ మోసం జరిగిందని రెగ్యులేటరీ ఫైలింగ్ వెల్లడించింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ మోసపూరితంగా రూ.1,203 కోట్ల రుణాన్ని పొందిందని పేర్కొంది.

సెబీ లిస్టింగ్ ఆబ్లిగేషన్స్ అండ్ డిస్ క్లోజర్ రిక్వైర్ మెంట్స్ (ఎల్ఓడిఆర్) బ్యాంకు విధానాల ప్రకారం సింటెక్స్ ఇండస్ట్రీస్ నికర నిరర్థక ఆస్తుల్లో రూ.1203 కోట్ల మేర మోసపూరిత రుణాలు ఉన్నాయని పంజాబ్ నేషనల్ బ్యాంకు స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఇక సదరు కంపెనీ ఖాతాల్లో 1,203.26 కోట్ల రూపాయల మోసంపై ఆర్‌బిఐకి రిపోర్ట్ చేసింది పీఎన్‌బీ. బ్యాంక్ ఇప్పటికే కంపెనీకి 215.21 కోట్ల రూపాయల కేటాయింపులు చేసింది. ఇదిలావుంటే వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, మెహుల్ చోక్సి పీఎన్‌బీకి భారీగా కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories