రాజకీయ దిగ్గజాన్ని కోల్పోయాం​ : ప్రధాని మోదీ

రాజకీయ దిగ్గజాన్ని కోల్పోయాం​ : ప్రధాని మోదీ
x
Highlights

ఆర్జేడీ నాయకుడు, లాలూ ప్రసాద్‌కు అత్యంత సన్నిహితుడైన కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్ (74) ఆదివారం..

ఆర్జేడీ నాయకుడు, లాలూ ప్రసాద్‌కు అత్యంత సన్నిహితుడైన కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్ (74) ఆదివారం ఆదివారం మరణించిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన తుది శ్వాస విడిచారు. గత నాలుగు రోజులుగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు.. దాంతో ఆయనను ఐసియులో చేర్చారు. అయితే ఆదివారం చికిత్స పొందుతూ ఆయన మరణించారు. రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్‌ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తన సంతాప సందేశంలో ఇలా పేర్కొన్నారు.. క్షేత్రస్ధాయి నుంచి ఎదిగిన రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్‌కు గ్రామీణ భారతంపై పూర్తిస్థాయి అవగాహన ఉందని అన్నారు.

బిహార్‌ ఓ రాజకీయ దిగ్గజాన్ని కోల్పోయిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నవభారత్‌, నవ బిహార్‌ నిర్మాణానికి రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్ తీవ్రంగా కృషి చేశారని‌ వ్యాఖ్యానించారు. ఆయన మృతి బిహార్‌తో పాటు దేశానికి తీరనిలోటని మోదీ అన్నారు. ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సింగ్‌ మరణం పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇదిలావుంటే 1977 లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన రఘువంశ్‌ ప్రసాద్‌ సింగ్.. ఆ తరువాత 5 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేశారు. జూన్ 23న ఆర్జేడీ పార్టీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. రెండు రోజుల కిందట ఆర్జేడీకి కూడా రాజీనామా చేశారు. ఆయన జేడీయూలో చేరతారని ప్రచారం జరిగింది.. కానీ ఇంతలోనే ఆయన మరణించడం బాధాకరం.

Show Full Article
Print Article
Next Story
More Stories