బడ్జెట్‌ సామాన్యుడికి అండగా నిలిచేలా ఉంది- ప్రధాని మోడీ

బడ్జెట్‌ సామాన్యుడికి అండగా నిలిచేలా ఉంది- ప్రధాని మోడీ
x

ప్రధాని మోడీ

Highlights

*మౌలిక వసతులకు పెద్దపీట వేశాం-ప్రధాని మోడీ *యువతకు ఉపాధి వకాశాలు పెరుగుతాయి-మోడీ

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ అన్ని వర్గాలనూ సంతృప్తిపరిచేలా ఉందని ప్రధాని మోడీ సంతృప్తి వ్యక్తం చేశారు. మౌలిక వసతులకు పెద్దపీట వేశామని..యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. సామాన్యులకు ఎటువంటి భారం పడకుండా జాగ్రత్త తీసుకున్నామని తెలిపారు. పారదర్శకతతో కూడిన బడ్జెట్‌ ప్రవేశపెట్టామని ప్రధాని వివరించారు. ఈ బడ్జెట్‌ అన్ని రంగాల అభివృద్ధికి దోహదపడేలా ఉందని..బడ్జెట్‌పై చాలా మంది ప్రముఖులు సంతోషం వ్యక్తం చేయడం ఆనందంగా ఉందని మోడీ అన్నారు

.రైతులు, గ్రామాల అభివృద్ధిపైనే ఈ బడ్జెట్ ప్రముఖంగా దృష్టి సారించిందని స్పష్టం చేశారు. ఈ బడ్జెట్‌ రైతుల ఆదాయం పెంపునకు దోహదం చేస్తుందని... గ్రామాలు, రైతులపైనే ఈ బడ్జెట్‌లో ప్రధానంగా దృష్టి పెట్టామని తాజా నిర్ణయాలు వెల్లడిచేస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories