Modi US Tour: అమెరికా పర్యటనలో మోడీ బిజీబిజీ

PM Narendra Modi US Tour Meeting with Kamala Harris | National News Today
x

అమెరికా పర్యటనలో మోడీ బిజీబిజీ

Highlights

Modi US Tour: *అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో మోడీ సమావేశం *ద్వైపాక్షి అంశాలపై చర్చించిన నేతలు

Modi US Tour: దేశంలో కరోనా రెండో మహమ్మారి ఉధ్ధృతి కొనసాగుతున్న సమయంలో భారత్‌కు సహకరించిన అమెరికాకు ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలవడం చారిత్రాత్మకం అని అన్నారు. ప్రపంచానికి కమలా ఒక స్ఫూర్తి అని కొనియాడారు.. బైడెన్, కమలా హారిస్ నేతృత్వంలో అమెరికా, ద్వైపాక్షిక సంబంధాలు ఇంకా మెరుగవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.. అమెరికా పర్యటనలో ఉన్న మోడీ, వైట్ హౌజ్‌లో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌తో సమావేశం అయ్యారు.. భారత్- అమెరికా సహజ భాగస్వాములు అని ప్రధాని అన్నారు. రెండు దేశాలు అతిపెద్ద ప్రజాస్వామ్యమైన దేశాలు అని.. ఒకే రకమైన విలువలు, భౌగోళిక రాజకీయ ప్రయోజనాలు కలిగి ఉన్నాయని మోడీ పేర్కొన్నారు.

మరోవైపు.. కమలా హారిస్‌ను భారత పర్యటనకు ప్రధాని మోడీ ఆహ్వానించారు. అమెరికాకు భారత్ ప్రత్యేక భాగస్వామని కమలా హారిస్ అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తి చెందిన తొలి రోజుల్లో ఎన్నో దేశాలకు భారత్ వ్యాక్సిన్ అందించిందన్నారు. ఇక భారత్‌లో రెండో దశ కరోనా వ్యాప్తి చెందినప్పుడు అమెరికా తన బాధ్యతగా సహకారం ఇచ్చిందని తెలిపారు. వ్యాక్సినేషన్ విషయంలోనూ సాయం చేసిందని కమలా హారిస్ వెల్లడించారు.

అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ పలువురు కంపెనీల సీఈవోలతో భేటీ అయ్యారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్, జపాన్ యోషిహిదే సుగాతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై సుగాతో మోడీ చర్చించారు. ఇండో- పసిఫిక్ ప్రాంతంలో భవిష్యత్ కార్యచరణపై చర్చించారు..

Show Full Article
Print Article
Next Story
More Stories