భారత్‌ అభివృద్ధిలో జపాన్‌ పెట్టుబడులది కీలకపాత్ర - మోడీ

PM Narendra Modi Speech at Quad Summit 2022 | Quad Summit Live Updates
x

భారత్‌ అభివృద్ధిలో జపాన్‌ పెట్టుబడులది కీలకపాత్ర - మోడీ

Highlights

Narendra Modi: సదస్సులో పాల్గొన్న జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాధినేతలు...

Narendra Modi: క్వాడ్‌ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. క్వాడ్‌ అనేది మంచి కోసం పుట్టుకొచ్చిన ఒక శక్తి అని, అది ఇండో-పసిఫిక్‌ను మెరుగుపరుస్తుందని అభివర్ణించారు. జపాన్ రాజధాని టోక్యో వేదికగా క్వాడ్ దేశాధినేతలు భేటీ అయ్యారు.

సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులు ఫుమియో కిషిదా, ఆంథోనీ అల్బనేస్ పాల్గొన్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, అంతర్జాతీయ అంశాలపై నేతలు తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా.. తక్కువ సమయంలోనే క్వాడ్ కూటమి ప్రపంచంలోనే ముఖ్యమైన స్థానాన్ని పొందిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం క్వాడ్ పరిధి విస్తృతమైందని, మరింత ప్రభావవంతంగా మారిందని అభిప్రాయపడ్డారు.

ముఖ్యంగా కరోనా కష్టకాలంలో సభ్యదేశాల మధ్య.. వ్యాక్సిన్‌ పంపిణీ, క్లైమేట్‌ యాక్షన్‌, డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌, ఆర్థిక తోడ్పాటుతో పరస్పర సహకారం మరింతగా వృద్ధి చెందిందని మోదీ తెలిపారు. సదస్సుకు ముందు.. బైడెన్‌, కిషిదా, అల్బనీస్‌లతో విడివిడిగా భేటీ అయ్యి ద్వైపాకక్షిక సంబంధాల గురించి చర్చించారు ప్రధాని మోదీ.

Show Full Article
Print Article
Next Story
More Stories