E-RUPI: ఇకపై నగదురహిత లావాదేవీలకు ప్రోత్సాహం

PM Narendra Modi Launches E-RUPI
x

E-RUPI: ఇకపై నగదురహిత లావాదేవీలకు ప్రోత్సాహం

Highlights

E-RUPI: ప్రధాని మోడీ ఈ -రూపీని ప్రారంభించారు.

E-RUPI: ప్రధాని మోడీ ఈ -రూపీని ప్రారంభించారు. డిజిటల్ చెల్లింపులను సులభతరం చేసేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీలకు ప్రోత్సాహకరంగా ఉంటుందని అన్నారు. ఈ -రూపీ వ్యవస్థ సులభమైనదని, సురక్షితమైనదని, కోవిడ్ టైమ్ లో అత్యంత ఉపయోగకరమైన చెల్లింపుల విధానమనీ ప్రధాని అన్నారు. దీనిలో వినియోగ దారుల వివరాలు గోప్యంగా ఉంటాయని, నగదు చెల్లింపులు పక్కాగా జరుగుతాయని అన్నారు.

ప్రస్తుతానికి 8 బ్యాంకుల ద్వారా ఈ రూపీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. బ్యాంకు కార్డులు, పేమెంట్ యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవసరం లేకుండానే ఓచర్ బేస్డ్ పేమెంట్ గా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. మొబైల్ ఫోన్ కు క్యూ ఆర్ కోడ్, ఎస్ ఎంఎస్ స్ట్రింగ్ ఓచర్లతో చెల్లింపులు జరుగుతాయి. ఈ కొత్త డిజిటల్ విధానం పేదలకు బాగా ఉపయోగపడుతుందని, చెల్లింపుల్లో ఎలాంటి నష‌్టం జరగకుండా ఉంటుందని ప్రధాని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories